అంతర్జాతీయం

అసహనం, హింస నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 30: భారత్‌లో ‘అసహనం, హింస’ పెరుగుతుండటం పట్ల అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు కారకులైన వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టి పౌరులకు రక్షణ కల్పించేందుకు భారత ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని అమెరికా విజ్ఞప్తి చేసింది. మధ్యప్రదేశ్‌లో దున్న మాంసాన్ని తీసుకెళ్తున్న ఇద్దరు ముస్లిం మహిళలపై దాడులు జరిగాయని, ఆవు మాంసాన్ని తింటున్న వారు హింసకు గురవుతున్నారని వచ్చిన వార్తల గురించి అడిగిన ప్రశ్నలకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ స్పందిస్తూ, అసహనం ఏ రూపంలో ఉన్నా ప్రతిఘటిస్తామని, మత స్వేచ్ఛను, భావప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించడంలో భారత ప్రభుత్వానికి, ప్రజలకు సంఘీభావంగా నిలుస్తామని చెప్పారు. ‘్భరత్‌లో అసహనం, హింస పెరుగుతున్నాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇందుకు బాధ్యులైన వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టి పౌరులకు తగిన రక్షణ కల్పించాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని కిర్బీ పేర్కొన్నారు.