అంతర్జాతీయం

ప్రతీకార దాడులు సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 19: పుల్వానా ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ హద్దుమీరి తమదేశంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే గట్టి జవాబు ఇస్తామని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. పుల్వానా దాడి వెనక పాక్‌ప్రమేయంపై ఆధారాలు ఉంటే చూపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. గత గురువారం పుల్వానాలో ఉగ్రవాది దాడి వెనక పాకిస్తాన్ ప్రమేయం ప్రత్యక్షంగా ఉందని భారత్ చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని పాకిస్తాన్ కోరుకుంటోందన్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం వల్లనే పుల్వానా దాడి జరిగిందని ప్రచారం చేయడం వల్ల ఓట్లు వస్తాయన్నారు. భారత్‌లో ఈ ఏడాది ఎన్నికల సంవత్సరమనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భారత్ చర్చలకు రావాలని ఆయన ఆహ్వానించారు. కాశ్మీర్‌లో ఏమి జరిగినా పాకిస్తాన్‌ను ద్వేషించడం భారత్‌కు అలవాటైందన్నారు. ఆఫ్గన్ అంశంలాగానే కాశ్మీర్ కూడా ఒక సమస్యని చర్చలద్వారానే పరిష్కరించుకోవాలన్నారు. పుల్వానా దాడిలో పాకిస్తాన్ పాత్ర ఉందని నిజంగా రుజువులు చూపిస్తే తప్పనిసరిగా తమ ప్రభుత్వం స్పందిస్తుందని ఆయన చెప్పారు. తమపైన ఎటువంటి వత్తిడి లేదని, కానీ ఆధారాలు చూపిస్తే తమ భూభాగంపైన ఉన్నవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. భారత్‌లో రాజకీయనాయకులు, మీడియా కూడా ప్రతీకారంపై మాట్లాడుతున్నారన్నారు. మాపై దాడి జరిగితే సమాధానం చెప్పకుండా ఎలా ఉంటాం అని ఆయన అన్నారు. ‘ యుద్ధం ప్రారంభించడం మన చేతుల్లోనే ఉంటుంది. కాని దాని ముగింపు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు’ అని ఆయన అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా పాకిస్తాన్ వ్యతిరేకిస్తుందన్నారు. ఉగ్రవాదంపై భారత్‌తో మాట్లాడేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందన్నారు. పాకిస్తాన్‌లో కొత్త సమాజం, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, కొత్త ఆలోచనలతో ఉన్నామని చెప్పారు. ఉగ్రవాదం అనేది నిజంగా పెద్ద సమస్యని, మాట్లాడేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉగ్రవాదం అన్నిదేశాల ప్రయోజనాలను ధ్వంసం చేస్తుందన్నారు. తమ దేశానికి సౌదనీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ విచ్చేస్తున్నారని, ఆ ఏర్పాట్లలో తమ దేశం ఉందన్నారు.
తమ దేశంపై అభియోగాలు మోపడం భారత్‌కు అలవాటైందన్నారు. తమ దేశం కూడా 15 ఏళ్లుగా ఉగ్రవాదంపై పోరాడుతోందన్నారు. కాశ్మీరీలు మరణానికి భయపడరని, ఈ ఘటనలు జరుగుతున్నాయంటే కారణమనేది ఉంటుందన్నారు. ఈ విషయమై భారత్‌లో చర్చ జరగదా అని ఆయన ప్రశ్నించారు. కాశ్మీర్ అంశానికి మిలిటరీ చర్య పరిష్కారమని భారత్ భావిస్తోందా అని ఆయన అడిగారు. ఈ తరహా చర్యలు ఫలప్రదం కావన్నారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య సంబంధాలు దిగజారాయన్నారు.
చిత్రం.. మీడియాతో మాట్లాడుతున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్