అంతర్జాతీయం

సమష్టి కృషితో ఉగ్రవాద నిర్మూలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్రా, జూన్ 13: ఉగ్రవాదం అనేది ఎల్లలు లేకుండా ప్రపంచమంతా విస్తరించిన మహమ్మారి అని పేర్కొంటూ నాగరిక ప్రపంచం సమష్టి కృషితో ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించి తీరాలని భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో ఘనా దేశానికి భారత్ మద్దతుగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రణబ్ ముఖర్జీ రెండు రోజుల పర్యటనకోసం ఇక్కడికి వచ్చారు. భారత రాష్టప్రతి ఘనా దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. ఘనా అధ్యక్షుడు జాన్ డ్రమని మహామా ఆదివారం ప్రణబ్ ముఖర్జీకి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ భారత్ గత మూడు దశాబ్దాలుగా ఉగ్రవాద బాధిత దేశమని అన్నారు. ఉగ్రవాదం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జాడ్యమన్న ఘనా ఆందోళనను ఆయన పంచుకున్నారు. ఉగ్రవాదానికి సిద్ధాంతమంటూ లేదని, విచక్షణారహితంగా విధ్వంసానికి పాల్పడడమే దానికి తెలిసిన సిద్ధాంతమని ఆయన విమర్శించారు. ఉగ్రవాద సవాలుతో పోరాడుతున్న ఘనాకు భారత్ సంఘీభావంగా నిలుస్తోందన్నారు. ఆఫ్రికా ఖండంలోని దేశాలతో మరింత సన్నిహిత సంబంధాలను నెలకొల్పుకోవాలన్న భారత ఆకాంక్షలో భాగమే రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఘనా పర్యటన. ఘనా అధ్యక్షుడు మహామా మాట్లాడుతూ భారత జాతిపిత మహాత్మా గాంధీని ప్రస్తావించారు. ఘనా తొలి అధ్యక్షుడు క్వామే క్రుమాహ్, భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మధ్య బంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ ఇద్దరు నేతలు అలీనోద్యమ వ్యవస్థాపక పితామహులని అన్నారు.
నేడు ప్రపంచ వ్యవస్థ ప్రపంచ పాలనా వ్యవస్థలను కోరుకుంటోందని, అయితే ప్రపంచ సమాజంతో పోరాడే కొత్త సవాళ్లు దీనిలో ఉన్నాయని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ప్రపంచంలోని ప్రతి ఆరో పౌరుడికి నిలయమైన భారత్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సచేతన కేంద్రమైన ఆఫ్రికా ఇప్పటికీ ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలికి వెలుపల ఉండటం తీవ్ర ఆందోళన కలిగించే నియమవిరుద్ధమైన అంశాలని ఆయన అన్నారు.

చిత్రం ఆక్రాలో సోమవారం ఘనా అధ్యక్షుడు మహామాతో సమావేశమైన రాష్టప్రతి ప్రణబ్