అంతర్జాతీయం

సిరియా పేలుళ్లలో 20 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డమాస్కస్, జూన్ 11: సిరియా రాజధాని డమాస్కస్‌కు సమీపంలో గల షియా ముస్లింలకు చెందిన ఒక ప్రార్థనా మందిరం వెలుపల శనివారం ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు జరిపిన జంట బాంబు దాడుల్లో 20 మంది మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా గల షియాలు ఎంతో పవిత్రమైనదిగా భావించే సయ్యిదా జెయినాబ్ ప్రార్థనా మందిరం ప్రవేశ మార్గం వద్ద ఒక ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకోగా, మరోచోట ఒక కారు బాంబు దాడి జరిగిందని అధికార వార్తాసంస్థ సానా తెలిపింది. ఈ పేలుళ్లలో 13 మంది పౌరులుసహా మొత్తం 20 మంది మృతి చెందారని, మరో 30 మందికి పైగా గాయపడ్డారని బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న సిరియన్ అబ్జర్వేటరి ఫర్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది. ఈ పేలుళ్లకు తామే పాల్పడినట్లు ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించారు. డమాస్కస్‌కు దక్షిణాన సుమారు పది కిలోమీటర్ల దూరంలో గల ఈ ప్రార్థనా మందిరం వద్ద పెద్ద సంఖ్యలో ప్రభుత్వ అనుకూల బలగాలు ఎప్పుడూ భద్రతా విధులు నిర్వహిస్తుంటాయి. అయినప్పటికీ అనేకసార్లు జిహాదిస్టులు దాడులకు పాల్పడ్డారు.

చిత్రం ప్రార్థనా మందిరం ప్రవేశ మార్గం వద్ద ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడి దృశ్యం