అంతర్జాతీయం

బంగ్లాదేశ్‌వ్యాప్తంగా పోలీసుల దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, జూన్ 11: బంగ్లాదేశ్‌లో ఇటీవలి కాలంలో మైనారిటీలపైన, లౌకిక వాద రచయితలపై జరుగుతున్న వరస దాడులకు ఫుల్‌స్టాప్ పెట్టడానికి శనివారం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిపిన దాడుల్లో 37 మంది మిలిటెంట్లు సహా 3 వేల మందికి పైగా అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు హంతకుల్లో ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని, అందరినీ శిక్షించి తీరుతామని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా శనివారం స్పష్టం చేశారు. అరెస్టయిన మిలిటెంట్లలో 27 మంది నిషేధిత జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్‌కు చెందిన వారేనని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎకెఎం షాహిదుర్ రహమాన్ విలేఖరులకు చెప్పారు.