అంతర్జాతీయం

ఐదుగురూ దోషులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 6: డెన్మార్క్‌కు చెందిన 52 సంవత్సరాల మహిళపై రెండేళ్ల క్రితం అత్యాచారానికి పాల్పడ్డారన్న కేసులో ఐదుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఈ మహిళను కత్తితో బెదిరించి, కిడ్నాప్ చేసి వీరు అత్యాచారానికి పాల్పడ్డారని కోర్టు ధ్రువీకరించింది. నిందితులు ఐదుగురిపై నమోదైన ఆరోపణలను నిర్ధారిస్తున్నామని అదనపు సెషన్స్ న్యాయమూర్తి రమేష్ కుమార్ వెల్లడించారు. అయితే కొత్త చట్టం ప్రకారం వీరికి ఏ విధమైన శిక్షలు వేయాలనే దానిపై తొమ్మిదిన విచారణ జరుపుతామని వెల్లడించారు. ఈ చట్టం ప్రకారం దోషులు 20ఏళ్ల కనీస కారాగార శిక్ష, గరిష్ఠ స్థాయిలో జీవితాంతం జైలుశిక్ష పడే అవకాశం ఉంది. భారత శిక్షా స్మృతిలోని 376డి (గ్యాంగ్ రేప్), 395 (దోపిడీ), 366 (కిడ్నాప్), 342 (అన్యాయంగా నిర్బంధించడం), 506 (నేరపూరిత బెదిరింపు), 34 (ఉమ్మడి ఉద్దేశం) సెక్షన్ల క్రింద వీరిని దోషులుగా ప్రకటించారు.