అంతర్జాతీయం

చర్చలతోనే శాంతి స్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 8: భారత్‌తో శాంతి చర్చల ప్రక్రియను నిలిపివేయాలన్న పాకిస్తాన్ నిర్ణయంపై అమెరికా స్పందించింది. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సడలిపోవాలంటే ప్రత్యక్ష చర్చలే శరణ్యమని అమెరికా స్పష్టం చేసింది. భారత్, పాక్‌లు పరస్పరం సహకరించుకుంటూ చర్చల ప్రక్రియ ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మార్క్ టోనెర్ స్పష్టం చేశారు.‘ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించుకోడానికి చర్చల ప్రక్రియ దోహదపడుతుందని మా విశ్వాసం. దీనికి ఇరుదేశాల ప్రభుత్వాలు ప్రయత్నించాలన్నదే మా భావన’అని శుక్రవారం ఆయన వ్యాఖ్యానించారు. శాంతి, సుస్థిరత కోసం జరిగే సంప్రదింపులు, చర్చలకు అమెరికా సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు. భారత్‌తో శాంతి చర్యలను నిలిపివేస్తున్నట్టు పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ చేసిన ప్రకటనపై మార్క్ మాట్లాడుతూ కాశ్మీర్ విషయంలో అమెరికా వైఖరి మారదని స్పష్టం చేశారు.
శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడం అన్నది ఇరుదేశాల చర్చలపైనే ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. భారత్, పాక్ మధ్య సత్సంబంధాలకు విఘాతం కలగకూడదన్నదే తమ ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. ఈ దిశగా ఇరుదేశాలు చేసే ప్రయత్నాలకు అమెరికా మద్దతు ఉంటుందని ఉద్ఘాటించారు. గూఢచర్యం ఆరోపణలపై పాక్ కస్టడీలో ఉన్న భారత మాజీ నావీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ అంశంపై మాట్లాడ్డానికి మార్క్ నిరాకరించారు.‘అరెస్టయిన విషయం తెలిసింది. అయితే అందుకు దారితీసిన పరిస్థితులు నాకు తెలియదు’ అని ప్రతినిధి స్పష్టం చేశారు.