అంతర్జాతీయం

అవును.. నిజమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఏప్రిల్ 8: ప్రపంచ నేతల్ని హడలెత్తిస్తున్న పనామా అక్రమ కంపెనీల జాబితా ఇప్పుడు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ మెడకు చుట్టుకుంటోంది. ఓ విదేశీ కంపెనీలో వాటా ద్వారా తాను లబ్ధి పొందిన మాట నిజమేనంటూ కామెరూన్ తాజాగా అంగీకరించడంతో ఆయనపై అన్ని వైపుల నుంచి వత్తిడి మొదలైంది. ఆర్థిక అనైతికతకు పాల్పడ్డారంటూ వస్తున్న ఆరోపణలు బ్రిటన్ ప్రధానిగా ఆయన కొనసాగడాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఐస్‌లాండ్ ప్రధాని సిగ్ముందర్ తరహాలో కామెరూన్ రాజీనామా చేస్తారా లేదా అన్నది ఇప్పటికిప్పుడే స్పష్టం కాకపోయినా ఐరోపా యూనియన్‌లో బ్రిటన్ కొనసాగడంపై వస్తున్న వత్తిళ్ల నేపథ్యంలో ఈ పరిణామం ఆయనకు కెరీర్ పరంగా ఇబ్బందికరమేనని చెబుతున్నారు. ఐరోపా యూనియన్ నుంచి వైదొలగాలని బ్రిటన్ ప్రజలు ఓటేస్తే మాత్రం కామెరూన్ పనైపోయినట్టేనని విశే్లషకులు భావిస్తున్నారు. పనామాలోని మొసాక్ ఫోనె్సకా న్యాయ సంస్థ నుంచి అయిదు రోజుల క్రితం మిలియన్ల కొద్దీ విడుదలైన డాక్యుమెంట్లలో కామెరూన్ పేరు ప్రముఖంగా రావటంతో నిజమేంటో తెలియాలంటూ ఆయనపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్న సంగతి తెలిసిందే. పనామాలో తన తండ్రి స్థాపించిన కంపెనీలో వాటాలు ఉన్న మాట వాస్తవమేనని, అయితే తాను దేశ ప్రధాని పదవి చేపట్టడానికి ఆరుమాసాల ముందు అందులోని వాటాలను అమ్మివేసినట్లు కామెరూన్ శుక్రవారం ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో అంగీకరించారు. ‘మా నాన్న స్టాక్ బ్రోకర్ కావటం వల్ల సహజంగానే నాకు గతంలో స్టాక్‌లు, షేర్లు ఉండేవి. పనామాలోని బ్లెయిర్ మోర్ హోల్డింగ్స్ కంపెనీలో ఉన్న 5వేల షేర్లను ప్రధాని కావటానికి ఆరు మాసాల ముందు 31,500 పౌండ్లకు అమ్మివేసాను’ అని కామెరూన్ వివరించారు. ప్రస్తుతం తనకు ఏ కంపెనీలోనూ ఎలాంటి షేర్లు లేవని.. భవిష్యత్తులోనూ ఏ కుటుంబ ట్రస్టు ద్వారా కూడా తాను లబ్ధి పొందదలచుకోలేదని స్పష్టం చేశారు.