అంతర్జాతీయం

కాశ్మీర్ మాకు జీవనాడి: పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ కాశ్మీర్‌ను పాకిస్తాన్‌కు జీవనాడిగా అభివర్ణిస్తూ, దీనిపై భారత్‌తో దీర్ఘకాలంగా ఉన్న వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తమ దేశం కోరుకుంటోందని చెప్పారు. పాకిస్తాన్ శాంతికాముక దేశమని, ఇతర దేవాలతో ముఖ్యంగా పొరుగుదేశాలతో శాంతియుత సంబంధాలనే తాము కోరుకుంటున్నామని బుధవారం ఇక్కడ పాకిస్తాన్ డే పరేడ్‌నుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన చెప్పారు. ఈ పరేడ్ సందర్భంగా పాకిస్తాన్ సైనిక పాటవాన్ని ప్రదర్శించడం జరిగింది. కాశ్మీర్ పాకిస్తాన్‌కు జీవనాడి అని, అయితే ఈ దీర్ఘకాలిక వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి తమ దేశం కృషిని కొనసాగిస్తుందని ఆయన చెప్పారు. అదే సమయంలో స్వయంనిర్ణయాధికారం కోసం కాశ్మీర్ ప్రజలు సాగిస్తున్న పోరాటానికి పాకిస్తాన్ తన నైతిక, రాజకీయ, దౌత్యపరమైన మద్దతును కొనసాగిస్తుందని కూడా ఆయన చెప్పారు. గత ఏడాది ముజఫరాబాద్‌లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ అసెంబ్లీ సంయుక్త సమావేశాన్ని ఉద్దేవించి మాట్లాడుతూ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా కాశ్మీర్‌ను పాక్ జీవనాడిగా అభివర్ణించడం తెలిసిందే. కాగా, పొరుగు దేవాలతో శాంతియుత సంబంధాలను పాక్ కోరుకోవడాన్ని తమ బలహీనతగా భావించవద్దని హుస్సేన్ అన్నారు. తమ దేశం ఏ దేశంతోను ఆయుధ పోటీకి దిగడం లేదని, తమ ఆయుధాలన్నీ కూడా ఆత్మరక్షణ కోసమేనని కూడా ఆయన చెప్పారు. గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగిన పాకిస్తాన్ డే వేడుకల్లో సైన్యం తాను తాజాగా సముపార్జించుకున్న ఆయుధాలను ప్రదర్శించడమే కాక సాంస్కృతిక ప్రదర్శన కూడా జరిగింది. గతంలో 2008 మార్చి 23న చివరగా పాక్ డే వేడుకలు జరిగాయి. అప్పుడు పౌర అధ్యక్షుడి హోదాలో జనరల్ పర్వేజ్ ముషారఫ్ పరేడ్‌ను వీక్షించారు. అయితే ఆ తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా నిలిపివేశారు. ముస్లింలకు ప్రత్యేక దేశాన్ని కోరుతూ 1940లో లాహోర్‌లో జరిగిన ముస్లింల సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించడానికి గుర్తుగా పాకిస్తాన్ దినోత్సవాన్ని జరుపుకొంటారు.