అంతర్జాతీయం

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సమితి శక్తి సరిపోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి: ప్రపంచానికే ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఐరాస వ్యవస్థ సరిపోదని, దానికి ప్రపంచ దేశాలన్నిటినుంచి మరింత సహకారం అవసరమని భారత్ అభిప్రాయపడింది. ‘ప్రపంచానికంతటికీ ముప్పుగా పరిణమించిన ఈ వైరస్‌ను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్య సమితిలో ఇప్పుడున్న వ్యవస్థ సరిపోదనేది మా అభిప్రాయం’ అని సమితిలో భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ హింసాత్మక ఉగ్రవాదాన్ని అదుపు చేయడంపై ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్ రూపొందించిన నివేదికపై జనరల్ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడుతూ చెప్పారు. అయితే శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో వివిధ దేశాలు వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో జనరల్ అసెంబ్లీ ఈ ప్రణాళికను ఆమోదించలేదు. దీనిపై మరింత లోతుగా చర్చించాలని నిర్ణయించింది. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి మలీసా లోధీ లేవనెత్తిన విదేశీ ఆక్రమణ, స్వయం నిర్ణయాధికారం లాంటి అంశాలను కూడా ఈ కార్యాచరణ ప్రణాళికలో చేర్చాలా వద్దా అనే వాటిపై ప్రధానంగా విభేదాలు వ్యక్తమయ్యాయి. బాన్ కి మూన్ ప్రతిపాదించిన కార్యాచరణ ప్రణాళిక ఈ సమస్యకు ఎంతమాత్రం పరిష్కారం కాదని అక్బరుద్దీన్ అన్నారు. హింసాత్మక ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ఐక్యరాజ్య సమితి సహాయాన్ని కోరే సభ్య దేశాలకు తోడ్పడే ఒక్క అంశంకూడా ఈ మొత్తం ప్రణాళికలో లేదని ఆయన అన్నారు. హింసాత్మక ఉగ్రవాదాన్ని అదుపు చేయడానికి ప్రతి దేశమూ సొంతంగా తనదైన జాతీయ కార్యాచరణ ప్రణాళికను అభివృద్ధి చేసుకోవాలని 2015 డిసెంబర్‌లో జనరల్ అసెంబ్లీకి సమర్పించిన ఈ నివేదిక సిఫార్సు చేసింది. అయితే ఈ నివేదిక సభ్య దేశాలకు బోలెడన్ని సలహాలు, సూచనలు చేసింది కానీ, ప్రభుత్వాలకు సమితి ఏం సాయం చేయనుందో మాత్రం చెప్పలేదని అక్బరుద్దీన్ అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం అనేది ప్రధానంగా ఆయా దేశాల బాధ్యతే అయినప్పటికీ, ఈ కృషిలో ఐక్యరాజ్య సమితినుంచి కూడా తగినంత సహాయం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.