అంతర్జాతీయం

తైపీ ఆసుపత్రిలోనే నేతాజీ మృతి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఫిబ్రవరి 8: భారత స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18వ తేదీన విమాన ప్రమాదంలో చిక్కుకున్న తర్వాత తైపీలోని ఆసుపత్రిలోనే కన్నుమూశారని ఆయన సహచరుడైన కజునోరి కునిజుకా అనే జపనీయుడు ధ్రువీకరించినట్లు ‘బోస్‌ఫైల్స్.ఇన్ఫో’ వెబ్‌సైట్ స్పష్టం చేసింది. నేతాజీ ముని మేనల్లుడైన ఆశిష్ రే బ్రిటన్‌లో ఈ వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేసి సుభాష్ చంద్రబోస్ జీవిత చరమాంక వివరాలను సంకలనం చేస్తున్న విషయం తెలిసిందే. 1943 నుంచి 1945 వరకు నేతాజీ సహచరుడిగా పనిచేసిన కజునోరి కునిజుకా ఇప్పటికీ సజీవంగానే ఉన్నారని, నేతాజీ చివరి రోజులకు సంబంధించిన గ్రాఫిక్ వివరాలను, అలాగే 1945 ఆగస్టు 18వ తేదీన తైపీలో విమాన ప్రమాదం జరగడంతో సుభాష్ చంద్రబోస్ మరణించిన విషయాన్ని కునిజుకా తన డైరీలో పొందుపర్చారని ఈ వెబ్‌సైట్ పేర్కొంది. ‘సాంకీ షింబున్’ వార్తాపత్రికకు చెందిన లండన్ విలేఖరి నొబురు ఒకాబే ఈ డైరీ ప్రతిని తమకు అందజేసినట్లు ‘బోస్‌ఫైల్స్.ఇన్ఫో’ వెల్లడించింది. ప్రస్తుతం 98 ఏళ్ల వయసులో ఉన్న కనిజుకా జపాన్‌లోని కోబ్‌లో నివసిస్తున్నారని, తాను కనిజుకాను కలవడంతో, విమాన ప్రమాదం తర్వాత తైపీలోని సైనిక ఆసుపత్రిలో నేతాజీ మృతిచెందినట్లు ఈ డైరీ ద్వారా ధ్రువీకరించారని ఒకాబే తెలిపారు. కాగా, ఈ డైరీలోని అంశాలు జపాన్ భాషలో ఉన్నాయని, త్వరలోనే వీటిని తర్జుమా చేయించి నేతాజీ మృతికి సంబంధించిన అంశాలను తమ వెబ్‌సైట్‌లో పోస్టు చేస్తామని ఆశిష్ రే పేర్కొన్నారు.