అంతర్జాతీయం

పాస్‌పోర్ట్, వీసా ఉంటేనే సరిపోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 25: అమెరికాలోకి ప్రవేశించడానికి సరయిన పాస్‌పోర్ట్, వీసాలు ఉంటేనే సరిపోదని ఈ దేశం భారతీయులకు స్పష్టం చేసింది. సరయిన పాస్‌పోర్ట్, వీసాలు కలిగి ఉన్నప్పటికీ వారి ప్రయాణ పత్రాల చట్టబద్ధత ప్రశ్నార్థకమయితే వారిని తమ దేశంలోకి ప్రవేశించనీయకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుంటారని అమెరికా వివరించింది. అతను లేదా ఆమె అమెరికాకు ఎందుకు వస్తున్నారనే అంశంపై ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రశ్నిస్తారని, వారి ప్రశ్నలకు సరయిన సమాధానాలు లభించకపోతే అమెరికాలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటారని ఢిల్లీలోని అమెరికా ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది. కాలిఫోర్నియాలోని నార్త్‌వెస్ట్ పాలిటెక్నిక్ యూనివర్శిటి, సిలికాన్ వ్యాలీ యూనివర్శిటీలలో ప్రవేశం పొందడానికి వచ్చిన 14మంది భారతీయ విద్యార్థులను ఎందుకు తిప్పి పంపారని ప్రశ్నిస్తూ భారత్ రాసిన లేఖకు సమాధానంగా అమెరికా దౌత్య కార్యాలయం ఈ వివరణ ఇచ్చింది.