అంతర్జాతీయం

భారత్‌పై అణ్వస్త్ర కేసును కొట్టేసిన ఐరాస కోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హేగ్, అక్టోబర్ 5: భారత్, పాకిస్తాన్, బ్రిటన్‌లకు వ్యతిరేకంగా మార్షల్ ద్వీపకల్పాలు దాఖలు చేసిన అణ్వస్త్ర కేసును ఐక్యరాజ్య సమితి ఉన్నత న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. రిపబ్లిక్ ఆఫ్ ద మార్షల్ ఇస్‌ల్యాండ్స్ దాఖలు చేసిన ఈ చరిత్రాత్మక కేసును 16 మంది న్యాయమూర్తులు గల ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ధర్మాసనం మెజారిటి తీర్పుతో కొట్టివేసింది. మూడు అణ్వస్త్ర దేశాలయిన భారత్, పాకిస్తాన్, బ్రిటన్‌లతో మార్షల్ ద్వీపకల్పాలకు ఇంతకుముందు వివాదం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. అయితే ప్రతి దేశం లేవనెత్తిన ‘పరిధికి సంబంధించిన అభ్యంతరాలను కోర్టు సమర్థిస్తోంది’ అంటూ న్యాయమూర్తి రోని అబ్రహాం అధ్యక్షతన గల ధర్మాసనం విడిగా ఇచ్చిన మరో తీర్పులో పేర్కొంది. ఐసిజె ఇచ్చిన ఈ తీర్పు చివరిది. అయితే ఐసిజె ఇచ్చిన ఈ తీర్పును అధ్యయనం చేస్తానని పసిఫిక్ మహాసముద్రంలో పలు ద్వీపకల్పాలతో కూడిన చిన్న దేశం మార్షల్ ఇస్‌ల్యాండ్స్ ప్రకటించింది. కాగా ఈ తీర్పు తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని మార్షల్ ద్వీపకల్పాల తరపు న్యాయవాది ఫోన్ వాన్ డెర్ బిసెన్ చెప్పారు.

భారత రాయబారి జె.ఎస్. ముకుల్‌కు అభినందనలు తెలుపుతున్న మార్షల్ ఐలాండ్స్ న్యాయావాది ఫోన్ వాన్ డెర్ బిసెన్