అంతర్జాతీయం

భారతతో వ్యూహాత్మక బంధానికి చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 15: భారత దేశాన్ని అంతర్జాతీయ వ్యూహాత్మ, రక్షణ భాగస్వామిగా గుర్తించడానికి ఒబామా ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి అమెరికా సెనేట్‌లో చుక్కెదురైంది. దీనికోసం అవసరమైన అమెరికా జాతీయ రక్షణ అధీకృత చట్టానికి ప్రతిపాదించిన కీలక సవరణ అమెరికా సెనేట్‌లో ఆమోదం పొందలేకపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా చట్టసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఒక రోజు తర్వాత రిపబ్లికన్ పార్టీ సీనియర్ సెనేటర్ జాన్ మెక్‌కెయిన్ నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్‌డిఏఏ)కు కీలక సవరణలను ప్రవేశపెట్టారు. ఈ సవరణలను గనుక సెనేట్ ఆమోదించి ఉంటే అమెరికా భారతదేశాన్ని ప్రపంచ వ్యూహాత్మక, రక్షణ భాగస్వామిగా గుర్తించడానికి వీలు కలిగేది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ప్రధాని మోదీ సమావేశమైన తర్వాత విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో సైతం అమెరికా భారతదేశాన్ని ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. దీని ఫలితంగా అమెరికానుంచి మన దేశానికి రక్షణ, సాంకేతిక రంగాలకు సంబంధించిన కీలక సమాచారం బదిలీ కావడానికి వీలు కలిగేది. ఎన్‌డిఏఏను సెనేట్ 83-13 ఓట్ల తేడాతో ఆమోదించింది కానీ మెక్‌కెయిన్ ఈ బిల్లుకు ప్రతిపాదించిన సవరణను మాత్రం సెనేట్ ఆమోదించకపోవడం గమనార్హం. ‘స్థూలంగా అన్ని పార్టీల మద్దతు ఉన్నప్పటికీ మన జాతీయ భద్రతకు కీలకమైన అనేక అంశాలను సెనేట్ చర్చించి, ఆమోదించలేక పోయినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను’ అని మెక్‌కెయిన్ పేర్కొన్నారు.