అంతర్జాతీయం

పాక్‌ను కవ్వించడమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూన్ 14: అణు సరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జి)లో భారత్‌కు సభ్యత్వం ఇవ్వడంవల్ల తమ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా దీనివల్ల పాకిస్తాన్‌ను కూడా రెచ్చగొట్టినట్టు అవుతుందని స్పష్టం చేసింది. ఎన్‌ఎస్‌జి సభ్యత్వం భారత్‌కు రాకుండా చైనా చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని భారత్ అధికారులు పెద్దగా పట్టించుకోనప్పటికీ ఇటీవల కాలంలో ‘డ్రాగన్’ వ్యాఖ్యల తీవ్రత మరింత పెరిగింది. చాలా బహిరంగంగానే భారత్ సభ్యత్వ ప్రతిపాదనను ప్రతిఘటిస్తునే ఉంది. ముఖ్యంగా భారత్‌కు సభ్యత్వాన్ని కల్పించే విషయంలో ఎన్‌ఎస్‌జి నిలువునా చీలిపోయిందని, ముఖ్యంగా అణువ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయని దేశాల విషయంలో ఈ వ్యతిరేకత చాలా స్పష్టంగానే కనిపిస్తోందని చైనా అధికారులు తెలిపారు. మంగళవాంనాడు మరింతగా రెచ్చిపోయిన చైనా ‘అణు లక్ష్యాలను సాధించడానికి కళ్లు మూసుకుపోయి వ్యవహరించకండి’ అని స్పష్టం చేసింది. ఎలాగైనా సరే ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం సాధించాలన్న పట్టుదల మంచిదికాదన్న సంకేతాన్ని అందించింది. ఈ నెల 24న సియోల్‌లో ఎన్‌ఎస్‌జి ప్లీనరీ సమావేశం జరుగనున్న దృష్ట్యా భారత్ తన సభ్యత్వ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇటీవల అమెరికాసహా పలుదేశాల్లో పర్యటించిన ప్రధాని మోదీ అన్నింటి మద్దతునూ కొడగట్టుకునేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. దాని ఫలితంగానే అమెరికాతోపాటు ఇప్పటికే ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం ఉన్న దేశాలు భారత్‌కు మద్దతు పలికాయి. అయితే చైనాసహా పలు దేశాల నుంచి వస్తున్న వ్యతిరేకత భారత్‌కు ఇబ్బందికరంగా మారింది. ఇదే విషయాన్ని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రస్తావించింది. ఎన్‌ఎస్‌జి అన్నది ఏకాభిప్రాయ ప్రాతిపదికగా పనిచేస్తుందని, ఇందులో ఏ ఒక్క దేశం వ్యతిరేకించినా కొత్త దేశానికి సభ్యత్వం రాదని తెలిపింది. అంతేకాకుండా అణు బలం కలిగిన భారత్, పాకిస్తాన్ ఎప్పటికప్పుడు పైచేయి సాధించేందుకే ప్రయత్నిస్తున్నాయని తెలిపింది. ఇలాంటి సమయంలో భారత్‌కు ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం కల్పించడం పాక్‌ను రెచ్చగొట్టడమేనని కూడా వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు దేశాల మధ్య అణు పోటీ ప్రబలమయ్యే అవకాశం ఉందని తెలిపింది. వాస్తవాలను విస్మరించి అణు లక్ష్యాలను సాధించుకోవాలన్న పట్టుదలను విడనాడాలని భారత్‌కు సూచించింది.