హైదరాబాద్

సంప్రదాయ నృత్యోత్సవాలను ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: సంప్రదాయ సంగీత, నృత్యోత్సవాలను ప్రోత్సహించాలని తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బద్మి శివ కుమార్ అన్నారు. ఇండియన్ కల్చరల్ ఆర్ట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘సంప్రదాయ సంగీత’ నృత్యోత్సవాలు గురువారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శివ కుమార్ పాల్గొని కళాకారులను అభినందించి సత్కరించారు. ఇండియన్ కల్చరల్ ఆర్ట్ నృత్య కళాకారులను ప్రొత్సహించడానికి అనేక విలక్షణమైన కార్యక్రమాలను రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్టల్రలో నిర్వహిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కళలు, కళాకారులను ప్రొత్సహిస్తుందని పేర్కొన్నారు. కళాకారులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్, సినీ దర్శకుడు మీర్ సయ్యద్, యక్షగాన కంఠీరవ డా.పసుమర్తి శేషుబాబు, ఆట కోఆర్డినేటర్ కరకాల కృష్ణారెడ్డి, అధ్యక్షురాలు పడాల బిందు మాధవి, కోఆర్డినేటర్ రజనీకాంత్ పాల్గొన్నారు.
అలరించిన సినీ సంగీత విభావరి
కాచిగూడ, ఫిబ్రవరి 27: బాలాజీ మ్యూజికల్స్ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి గురువారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. ప్రముఖ గాయకుడు టీ.రామోజీ నిర్వహణలో గాయనీ, గాయకులు చంద్రతేజ, లలితా రావు, జ్యోతి, టీవీ రావు, గంటి రామకృష్ణ, భరద్వాజ్, సుబ్బిరెడ్డి, గంటి శైలజ అలపించిన సినీ గీతాలు అలరించాయి. కార్యక్రమానికి శంకరం వేదిక అధ్యక్షుడు యలవర్తి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని గాయకులను అభినందించి సత్కరించారు.
రంజింపజేసిన
‘మమతల కోవెల’ నాటక ప్రదర్శన
కాచిగూడ, ఫిబ్రవరి 27: ప్రముఖ నాటక రచయిత, దర్శకుడు సూదనగుంట వెంకటేశ్వర్లు దర్శకత్వం వహించిన ‘మమత కోవెల’ నాటక ప్రదర్శన రసరంజని, ఎన్టీ ఆర్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి పాల్గొని కళాకారులను అభినందించి సత్కరించారు. రసరంజని సంస్థ ప్రతి నెల క్రమం తప్పకుండా నాటక ప్రదర్శనలను ప్రదర్శించి నాటక రంగానికి ఎనలేని సేవలను చేస్తుందని పేర్కొన్నారు. మమతల కోవెల నాటక ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది.