హైదరాబాద్

నిఘా ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: 150 వార్డులు, 625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న నగరంలో నిఘా ముమ్మరం కానుంది.గ్రేటర్‌లో శాంతి భద్రతల దృష్టా నిఘా ముమ్మరం చేశారు.
అన్ని మెయిన్‌రోడ్లు, జనసంచారముండే ప్రాంతాలతో పాటు సబ్ రోడ్లలో కూడా సీసీ కెమెరాలు, టీవీలను అమర్చే పనులు చరుకుగా సాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు అడపాదడపా ఈ పనులు కొనసాగుతుండగా, బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ రూం పనులు తుది దశకు చేరటంతో సీసీ కెమెరాల ఏర్పాటు పనులను కూడా అధికారులు ముమ్మరం చేశారు. మొత్తం నగరంలో 59 కిలోమీటర్ల విస్తీర్ణంలో 2662 జంక్షన్లలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం పోల్స్ వేసేందుకు రోడ్ల తవ్వకాల కోసం పోలీసు శాఖ బల్దియా అనుమతులు కోరగా, ఇప్పటి వరకు 2557 చోట్ల బల్దియా అనుమతులిచ్చింది. నెట్‌వర్క్ పనుల కోసం రిలయెన్స్ జియో సంస్థకు 1077 జంక్షన్లలో స్వల్పంగా రోడ్లను తవ్వేందుకు అనుమతి కోరగా, అందులో బల్దియా మొదటి విడతగా 493 చోట్ల కట్టింగ్‌లకు బల్దియా అనుమతులిచ్చింది. ఇందులో ఇప్పటి వరకు ఆ సంస్థ 297 ప్రాంతాల్లో5.79 కిలోమీటర్ల పొడువున మెట్రోకట్టింగ్‌లను పూర్తి చేయగా, మరికొన్ని చోట్ల రోడ్లను పునరుద్దరించాల్సిన పనులు మిగిలిపోయాయి. అంతేగాక, పోల్స్, సీసీ కెమెరాల ఏర్పాటు పనులు పూర్తికాగానే, 48 గంటల్లో రోడ్లను పునరుద్దరించాలని సూచించింది. రోడ్లపై జరిపిన తవ్వకాలతో నగరవాసులకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుగా కట్టింగ్‌లు జరిపే ప్రాంతాల్లో బల్దియ, పోలీసు అధికారులను ఇటీవలే నోడల్ ఆఫీసర్లుగా నియమించిన సంగతి తెలిసిందే! ఇప్పటి వరకు వివిధ ప్రభుత్వ శాఖలు వారి అవసరాలకు తగిన విధంగా వేర్వేరుగా పోల్స్ ఏర్పాటు చేయగా, ప్రస్తుతం ఒక శాఖ ఏర్పాటు చేసే పోల్స్‌లను ఇతర శాఖల అవసరాలకు కూడా వినియోగించుకోవాలని ఇటీవలే అధికారులు నిర్ణయించారు. రోడ్ కట్టింగ్ జరిపిన ప్రాంతాల్లో శిథిలాలను తొలగించాల్సిన బాధ్యత సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్న సంస్థదేనని స్పష్టంగా తెలియజేసినా, కొన్ని చోట్ల అధికారుల మధ్య నెలకొన్న సమన్వలోపం కారణంగా రోజులు గడుస్తున్నా, పునరుద్దరణ పనులు చేపట్టలేకపోయారు.
సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయి, కమాండ్ కంట్రోల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నగరం మొత్తం సీసీ కెమెరాల నిఘా పరిధిలోకి వెళ్లనుంది. దీంతో నేర నివారణ, ప్రమాదాలు, విపత్తుల సంభవించినపుడు సత్వర సహాయక చర్యలు వంటివి మెరుగుపడే అవకాశాలున్నాయి.