హైదరాబాద్

బల్దియాకు ముందస్తు ఎన్నికలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీకి కూడా ప్రభుత్వ ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల నిర్వహించి, అఖండ విజయాన్ని సాధించిన ప్రభుత్వం ఆ తర్వాత నిర్వహించిన సర్పంచ్, మున్సిపల్, సహకార ఎన్నికల్లోనూ ఎవరూ ఊహించని విధంగా వరుసగా రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించిన ఊపులోనే బల్దియా ఎన్నికల్లో కూడా విజయం సాధించేందుకు సర్కార్ వ్యూహాం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీన పదవీకాలం ముగియనున్నా, మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తే జీహెచ్‌ఎంసీలోనూ అధికార పార్టీ అఖండ విజయం సాధిస్తుందన్నది ప్రభుత్వం అంచనాలు. ఇప్పటికే అధికారులకు ప్రభుత్వం నుంచి వౌఖికంగా ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీలోని పాలక మండలి అధికారంలో ఉన్నపుడే మెట్రోరైలు మూడు కారిడార్లు ప్రజలకు అందుబాటులోకి రావటం, నగరంలో సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సర్కారు ప్రతిపాదించిన ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు కింద పలు చోట్ల అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి రావటంతో ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలమైన అభిప్రాయం ఉన్నపుడే ఎన్నికలో నిర్వహిస్తే గతంలో కన్నా మరిన్ని ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. రాష్టవ్య్రాప్తంగా సర్కారుకు అన్ని రకాల అనుకూలమైన రాజకీయ పరిస్థితులు ఉండటంతో, ఇప్పటికే ఎండాకాలం ప్రారంభం కావటంతో మున్ముందు రాష్ట్రంలో వాతావరణ పరంగా కూడా ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో? వాటి ప్రభావం ఎన్నికలపై ఎలా ఉంటుందోననే అంశంపై సర్కార్ తర్జనభర్జన చేస్తున్నట్లు సమాచారం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచిన ఆరేళ్లలో ప్రభుత్వం భావించిన విధంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో అధికార పార్టీ మార్కు అభివృద్ధి గ్రేటర్ ఓటర్లకు నేరుగా కన్పిస్తున్నందున పాలక మండలి అధికార గడువు ముగియకముందే ఎన్నికలు నిర్వహిస్తే మంచి ఫలితాలు వస్తాయని పలువురు అధికార పార్టీ నేతలు కూడా ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి సూచించినందున సర్కారు ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వచ్చే అక్టోబర్, నవంబర్ మాసాల్లో అంటే గడువు కన్నా నాలుగైదు నెలల ముందు ఎన్నికలకు వెళ్లేందుకు జీహెచ్‌ఎంసీ చట్టంలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయనే అంశంపై కూడా సర్కార్ దృష్టి సారించినట్లు తెలిసింది.