హైదరాబాద్

మళ్లీ తెరపైకి బెగ్గర్ ఫ్రీ సిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరాన్ని యాచక రహిత నగరం (బెగ్గర్ ఫ్రీ సిటీ)గా తీర్చిదిద్దేందుకు ఇప్పటి వరకు సుమారు అరడజను ప్రభుత్వ శాఖలు దాదాపు రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్నా, ఆశించిన ఫలితం దక్కటం లేదు. తాజాగా మరోసారి బెగ్గర్ ఫ్రీ సిటీ అంశం తెరపైకొచ్చింది. ఇప్పటి వరకు పలు సార్లు రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ వేర్వేరుగా ఈ దిశగా ప్రయత్నాలు చేసినా, ఇపుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నియమించిన అధికారుల బృందం అన్ని రాష్ట్రాల అధికారులతో చర్చలు జరుపుతోంది. ఉన్నతాధికారుల బృందం శనివారం జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైంది. దేశాన్ని బెగ్గర్ ఫ్రీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రణాళికల్లో భాగంగానే హైదరాబాద్ నగరంలో యాచకులకు ప్రయోగాత్మకంగా పునరావాసం, వైద్యం, వారికి బతుకుదెరువు కల్పించేందుకు నైపుణ్య కోర్సుల్లో శిక్షణ వంటి అంశాలతో యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఏప్రిల్ నుంచి ఏడాది పాటు యాచకులకు రూ.10 కోట్లను వెచ్చించి ప్రత్యామ్నాయ పునరావాసం కల్పించనుంది. ఇప్పటికే యాచకులకు సేవలందిస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలను, జీహెచ్‌ఎంసీ, సాంఘిక సంక్షేమ శాఖ, యూసీడీ అధికారులను ఇందులో భాగస్వాములను చేయాలని కేంద్ర యోచిస్తుంది. కేంద్ర ప్రభుత్వ నియమించిన ఉన్నతాధికారుల బృందంలో ఇరవై ఏళ్ల క్రితం హైదరాబాద్ కలెక్టర్‌గా పనిచేసిన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం ఉండటం విశేషం. నగరంలో భౌగోళిక పరిస్థితులు, వౌలిక వసతులు, ఇక్కడి ప్రజల జీవైన శైలితో పాటు రాజకీయ, ఆర్థిక, కుటుంబ పరిస్థితులపై ఆయనకు పట్టుండటంతో ఈ సర్వే విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముందుగా యాచకులను తరలింపు, ఆశ్రయం అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, వారిని తరలించి, వారిలో శారీరక రుగ్మతులున్న వారికి వైద్య సేవలను అందించనున్నారు. యాచకుల్లో సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, మహిళలు, పిల్లలను గుర్తించేందుకు ఏప్రిల్ మాసం నుంచి ఒకవైపు సమగ్ర సర్వే, మరోవైపు ప్రత్యామ్నాయ పునరావాస చర్యలు సమాంతరంగా నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది.