హైదరాబాద్

24 నుంచి నిర్లక్షరాస్యుల సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో నూటికి నూరు శాతం అక్షరాస్యతను సాధించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ నెల 24వ తేదీ నుంచి నగరంలో ప్రత్యేక సర్వే నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. ఈనెల 24వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు ఈ సర్వేను నిర్వహించి, అందులో నిరక్షరాస్యులను గుర్తించి, వారిని ఎలా అక్షరాస్యులుగా మార్చాలనే అంశంపై కసరత్తు చేయనున్నారు. ప్రతి ఒక అక్షరాస్యుడు కనీసం ఒక నిరక్షరాస్యుడిని అక్షరాస్యుడిగా గుర్తించే బాధ్యతలను అప్పగించి, ఈ ఉద్యమంలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. సర్వేను నగరంలోని 150 మంది కార్పొరేటర్లు తమ ఇంటి నుంచే ప్రారంభించాలని సర్కార్ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. 30 సర్కిళ్లు, ఆరు జోన్లతో కలిపి మొత్తం 625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న నగరాన్ని ఈ సర్వే కోసం 5704 లొకాలిటీలుగా విభజించి, సర్వే నిర్వహించేందుకు వీలుగా 8681 మంది ఎన్యుమరేట్లను నియమించినట్లు అధికారులు తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం నగరంలో 24లక్షల 78వేల కుటుంబాలు నివాసం ఉంటున్నట్లు, అందులో మొత్తం 97లక్షల 97వేల జనాభా ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఒక్కో ఎన్యుమరేటర్ ప్రతిరోజు 250 నుంచి 300 ఇళ్లను సందర్శించి, ప్రతి ఇంట్లో అక్షరాస్యులు, నిరక్షరాస్యుల వివరాలను సేకరించాలని నిబంధన విధించారు.