హైదరాబాద్

తుది దశలో పంచతత్వ పార్కు పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరవాసుల ఆరోగ్య పరిరక్షణలో బల్దియా తనవంతు బాధ్యతను నిర్వర్తించేందుకు సిద్ధమైంది. పలు ప్రాంతాల్లో పాదచారులకు సౌకర్యవంతమైన ఫుట్‌పాత్‌లను అందుబాటులోకి తెస్తే మార్నింగ్ వాకింగ్ చేసి ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే వారు పెరుగుతారని ఇటీవలే మున్సిపల్ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో ఫుట్‌పాత్‌లను అందుబాటులోకి తెచ్చి, రోడ్డు వాహానాలు సక్రమంగా రాకపోకలు సాగించేందుకు అనుకూలంగా చర్యలను ప్రారంభించిన బల్దియా ఇపుడు ఇందిరాపార్కులో చేపట్టిన పంచతత్వ పార్కు పనులు తుది దశకు చేరుకున్నారు. ఎకరం స్థలంలో ఎనిమిది అంశాలతో కూడిన ఆక్యూప్రెజర్ వాకింగ్ ట్రాక్‌ను ఈ పార్కుల్లో అందుబాటులోకి తేనున్నారు. జోన్లవారీగా పార్కులను అభివృద్ధి చేసే ప్రతిపాదన కింద ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 80 పనులు పూర్తయి, ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ పార్కును వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు అదనపు కమిషనర్(బయోడైవర్శిటీ) కృష్ణ తెలిపారు.
రోజురోజుకి యాంత్రిక జీవనంతో గడితే మహానగరవాసులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వీలుగా వాకింగ్ ఇతర వ్యాయామం చేసేందుకు వీలుగా పార్కులను తీర్చిదిద్దటంతో పాటు ప్రకృతి పరమైన వైద్య సదుపాయాన్ని కూడా బల్దియా అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా ఎనిమిది అంశాలతో ఇందిరాపార్కులో ప్రత్యేకంగా ఆక్యూప్రెజర్ వాకింగ్ ట్రాక్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ వాకింగ్ ట్రాక్‌పై నడుస్తున్నపుడు పాదాల అడుగు భాగంలో ఉన్న నరాలపై వివిధ స్థాయిలో వత్తిడిని కల్గించి, రక్తప్రసరణను మెరుగుపరిచేందుకు వీలుగా 10మిల్లీమీటర్ల నుంచి 20 మిల్లీ మీటర్ల పరిమాణంలో ఉన్న రివర్ స్టోన్స్‌ను అమర్చనున్నారు. ఇసుక, బెరడు, నల్లరేగడి మట్టి, నీటి బ్లాక్‌లను విడివిడిగా అనుసంధానం చేస్తూ వాకింగ్ ట్రాక్‌ను నిర్మిస్తున్నారు.
ఈ ట్రాక్‌కు ఇరువైపులా 40 రకాల ఔషధ, హెర్బల్ మొక్కలను ప్రత్యేక బ్లాక్‌లుగా ఏర్పాటు చేస్తన్నారు. నరాలపై అధిక వత్తిడి నుంచి క్రమంగా వత్తిడి తగ్గించేలా ఈ ట్రాక్‌ను రూపొందిస్తున్నారు. రక్తప్రసరణ సక్రమంగా జరిగే రక్తపోటు అదుపులో ఉండి, ఇతర అనారోగ్యాలు దూరమవుతాయని జీహెచ్‌ఎంసీ అధికారులంటున్నారు.