హైదరాబాద్

అఖిల భారత మ్యూజిక్ బ్యాండ్ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్: పోలీసులు ఖాకీ డ్రెస్స్‌ను ఎందుకు ధరిస్తారంటే మిగతావారిని కలర్‌ఫుల్ డ్రెస్సుల్లో ఆనందంగా ఉంచడం కోసమేనని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. బుధవారం సికింధరాబాద్ రైల్వే సోర్ట్స్ మైదానంలో 20వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిథిగా హాజరై రంగురంగుల బెలూన్‌లను గాలిలోకి వదిలి ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వే ఆర్పీఎఫ్ పోలీసుల ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీస్ బ్యాండ్లు పాల్గొంటున్నాయి. గవర్నర్ మాట్లాడుతూ రైల్వే ప్రొటెక్షణ్ ఫోర్స్‌లో 10శాతం మంది మహిళలను తీసుకొని దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. సంగీతం మన జీవితం, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలతో పెనవేసుకొని ఉందని, కొన్ని రోగాలను తగ్గించే శక్తి కూడా ఉందని అన్నారు. మ్యూజిక్ బ్యాండ్‌ను ప్రదర్శించడం అంత సులభం కాదని, దానిని నేర్చుకొని ప్రదర్శిస్తున్న వారిని అభినందించారు. ప్రత్యేకంగా ప్రదర్శన చేసి అలరించిన రాజస్థాన్ మహిళా బ్యాండ్ బృందాన్ని గవర్నర్ అభినందించారు. ఏర్పాట్ల పట్ల ఆర్పీఎఫ్ అధికారులను, దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యను అభినందించారు. తెలంగాణ వాతావరణాన్ని, ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలను ఆస్వాదించాలని కోరారు. 22 రాష్ట్రాల పోలీస్ బ్యాండ్లు, సెంట్రల్ పారా మిలటరీ దళాలు చేసిన మార్చ్ఫాస్ట్ అతిధులతో పాటు ప్రేక్షకులను అలరించింది.
కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా, ఆర్పీఎఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఈశ్వర రావు, ఆర్పీఎఫ్ డీజీ అరుణ్ కుమార్ హాజరయ్యారు.