హైదరాబాద్

డబుల్ ఇళ్ల దరఖాస్తుదారులు..మధ్యవర్తులను నమ్మొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలోని పట్టణ పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు మధ్యవర్తులు, దళారులను నమ్మోద్దని కలెక్టర్ శే్వతా మహంతి అన్నారు. యూసుఫ్‌గూడ, రెహ్మాత్‌నగర్‌కు చెందిన ఓ మహిళా డబుల్ బెడ్‌రూమ్ ఇంటి కేటయింపునకు సంబంధించి మధ్యవర్తుల చేతుల్లో మోసపోయిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరగటంతో కలెక్టర్ ఈ మేరకు స్పందించారు. దరఖాస్తుదారురాలికి కొందరు మధ్యవర్తులు.. కలెక్టర్ ఆఫీసుకు చెందినట్లు నకిలీ స్టాంపు వేసి, ఆమె నుంచి డబ్బు వసూలు చేసుకున్న ఘటన జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో కలెక్టర్ మాట్లాడుతూ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు తమకేమైనా సందేహాలుంటే నేరుగా సంబంధించి అధికారులను సంప్రదించి, తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని, మధ్యవర్తులను ఆశ్రయించరాదని సూచించారు. ఈ రకంగా మోసాలకు పాల్పడే వారెవరైనా ఉపేక్షించేది లేదని, మధ్యవర్తులు అమాయకులైన ప్రజలను మోసగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవటమే కాకుండా, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.