హైదరాబాద్

సమన్వయంతో నగరాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరవాసుల జీవనంతో ముడిపడి ఉన్న పోలీసు, జీహెచ్‌ఎంసీ విభాగాల మధ్య సమన్వయం పెరిగితేనే అభివృద్ధి సాధ్యమవుతోందని బల్దియా కమిషనర్ లోకేశ్‌కుమార్ అన్నారు. పోలీసు శాఖతో సమన్వయాన్ని పెంచేందుకు గురువారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ అధ్యక్షతన ప్రత్యేక సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ 2020లో వౌళిక వసతులు, అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేందుకు నిధులు సమకూర్చుకున్నట్లు తెలిపారు. ఎస్‌ఆర్‌డీపీ క్రితం 24 ప్రాజెక్టులతో పాటు 35 లింకు రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. శివారు ప్రాంతాల్లో 350 కిలోమీటర్ల పొడువున కొత్తగా బీటీ రోడ్లు వేయనున్నట్లు తెలిపారు. సీఆర్‌ఎంపీ కింద 709 కిలోమీటర్ల రోడ్ల నిర్వాహణను ఏజెన్సీలకు అప్పగించినట్లు, లైటింగ్‌ను పెంచేందుకు 4.4లక్షల ఎల్‌ఈడీ లైట్లను అమర్చినట్లు వెల్లడించారు. 474 ట్రాఫిక్ సిగ్నల్స్ ఆధునీకరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌అడిషనల్ కమిషనర్ అనిల్‌కుమార్, శిఖా గోయల్, డీఎస్ చౌహాన్, డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు.