హైదరాబాద్

‘కోడ్’కు తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మున్సిపల్, పాతబస్తీలోని డబీర్‌పురా వార్డు ఉప ఎన్నికల కోడ్ అమలకు తెర పడింది. నగర శివార్లలోని పలు మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిగి సోమవారం మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నిక ప్రక్రియ దాదాపుగా పూర్తికావటంతో ఎన్నికల కోడ్ అమలుకు సోమవారం సాయంత్రం నుంచి తెర పడింది. నగరంలోని కోటిన్నర జనాభాకు అవసరమైన, అత్యవసరమైన పౌరసేవల నిర్వహణ, అవసరాలకు తగిన విధంగా అభివృద్ది పనులు చేపడుతూ నిత్యం బిజీగా ఉండే బల్దియాలో కోడ్ అమలు కారణంగా నెలకొన్న స్తబ్దత తొలగిపోనుంది. కార్పొరేషన్ చేపట్టే ప్రతి అభివృద్ధి పని, రొటీన్ మెయింటనెన్స్ పనులతో పాటు పరిపాలన వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించే స్థారుూ సంఘం సమావేశాలు, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి వంటి కార్యక్రమాలు గత కొంతకాలంగా ఎన్నికల కోడ్ అమలు కారణంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే! ఇపుడు కోడ్‌కు తెర పడటంతో మంగళవారం నుంచి బల్దియా మళ్లీ బిజీ కానుంది. ఎన్నో ప్రతిపాదనలు మూలన పడినందున నేడో,రేపో స్థారుూ సంఘం సమావేశాన్ని నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ పాలక మండలి భావిస్తోంది. ఇప్పటికే రాష్టవ్య్రాప్తంగా మున్సిపల్ ఎన్నికల హడావుడి ముగిసినా, ఒకటి రెండు మున్సిపాల్టీలు,కార్పొరేషన్లలో జరగాల్సిన చైర్మన్, మేయర్ ఎన్నికల్లో నగర మేయర్ బొంతు రామ్మోహన్ బిజీగా ఉన్నందున, ఆయన వచ్చిన తర్వాతే స్థారుూ సంఘం సమావేశం జరిగే అవకాశాలున్నాయి. కానీ కోడ్ తొలగిపోవటంతో పలు అభివృద్ధి పనులపై అధికారుల పర్యటనలు, సమీక్షలు, సమావేశాలు నేటి నుంచి మళ్లీ ఊపందుకోనున్నాయి. దీంతో పాటు స్వచ్ఛ సర్వేక్షణ్ షెడ్యూల్డు ఇప్పటికే ఖరారు కావటంతో పలు స్వచ్ఛ కార్యక్రమాలు, అలాగే సరికొత్త అభివృద్ధి ప్రతిపాదనలు నేటి నుంచి బల్దియాలో తెరపైకి రానున్నాయి. నగరంలోని పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రస్తుతం నిర్వహిస్తున్న బస్తీ దవాఖానాల సంఖ్య 256కు పెంచేందుకు, అదనంగా అవసరమైన బస్తీ దవాఖానాలకు స్వచ్ఛ దవాఖానాలుగా పేరు మార్పు, కొత్త ఏర్పాటు చేయనున్న వాటికి సంబంధించి అధికారిక ప్రకటన ఈ ఎన్నికల కోడ్ వల్లే నిల్చిపోగా, ఇప్పటికే సర్కారు పరిశీలనలో ఉన్న ఈ అంశానికి సంబంధించి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది.