హైదరాబాద్

గాంధీ వర్ధంతి నిర్వహణకు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహాత్మగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల 30న లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్‌లో నిర్వహించనున్న కార్యక్రమానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ జీ.రవి వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. గాంధీ వర్ధంతి ఏర్పాట్లపై పర్యాటక, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, పోలీసు, జలమండలి, అర్ అండ్ బీ, హార్టికల్చర్, విద్యా, వైద్య, సమాచార, ఫైర్ ఇతర శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో వ్యవహారించాలని ఆదేశించారు. బాపూఘాట్ లోపల, బాపూజీ సమాధి, ప్రార్థన మందిరం, పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని, టాయిలెట్లను అందుబాటులో ఉంచాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. తగిన స్థాయిలో తాగునీరు అందుబాటులో ఉండేలా జలమండలి, ముఖ్యమంత్రితో పాటు ఇతర వీవీపీలు, వీఐపీలు హాజరవుతున్నందున బందోబస్తుకు పోలీసు శాఖ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పోలీసు అధికారులు ప్రత్యేకంగా బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలని, మైక్ సిస్టమ్, భజనలు, సర్వమత ప్రార్థనలు ఏర్పాటు చేయాలని సమాచార శాఖను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ ఏర్పాట్లు చేయాలని, అన్ని శాఖలకు చెందిన అధికారులంతా ప్రణాళికబద్ధంగా పనులను సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో చేయాల్సిన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో హైదరాబాద్, సికిందరాబాద్ ఆర్డీఓలు శ్రీను, వసంత కుమారి, టూరిజం శాఖాధికారి రవీందర్ రెడ్డి, అగ్నిమాపక శాఖాధికారి చంద్రశేఖర్, టీఎస్‌టీడీసీ అధికారి అంజిరెడ్డి, డీఈఓ వెంకట నర్సమ్మ, ఆర్‌అండ్‌బీ డిప్యూటీ ఈఈ కమలేష్ కుమార్, హార్టికల్చర్ అధికారి జీ.ప్రసాద్ హాజరయ్యారు.