హైదరాబాద్

‘స్థారుూ’ సంఘంలో 17 తీర్మానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పౌరసేవల నిర్వహణ, అభివృద్ధితో పాటు పరిపాలన అంశాల్లో కీలక పాత్ర పోషించే స్థారుూ సంఘం మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన గురువారం మరోసారి సమావేశమైంది. సమావేశంలో మొత్తం 17 అంశాలకు అనుకూలంగా తీర్మానం చేసింది. కమిటీ సభ్యులు చెరుకు సంగీత ప్రశాంత్‌గౌడ్, ఎక్కల చైతన్య కన్న, షేక్ హామీద్, తొంట అంజయ్య, రావుల శేషగిరి, ఆర్.శిరీష, సామల హేమ, సబీహా బేగంతో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, అద్వైత్ కుమార్ సింగ్, శృతి ఓజా, సిక్తాపట్నాయక్, చీఫ్ సిటీ ప్లానర్ ఎస్.దేవేందర్ రెడ్డి హాజరయ్యారు.
తీర్మానాల వివరాలు
* హయత్‌నగర్ సర్కిల్‌లోని ఫతుల్లాగూలోని కృష్ణానగర్ సర్వే నెంబర్ 34లో ఉన్న 22వేల 500 చదరపు మీటర్ల ఖాళీ స్థలాన్ని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్డు యార్డు ఏర్పాటుకు కేటాయించాలని తీర్మానం
* శేరిలింగంపల్లి సర్కిల్‌లోని బొటానికల్ గార్డెన్ నుంచి మసీద్ బండ వరకు రెండు కిలోమీటర్ల మార్గంలో ఉన్న సెంట్రల్ మీడియం, ట్రాఫిక్ ఐలాండ్‌లను సీఎస్‌ఆర్ కింద నిర్వహించేందుకు మెస్సర్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు అప్పగించే ప్రతిపాదనకు ఆమోదం.
* కొండాపూర్‌లోని కందికుంట చెరువులో 15 కిలో కేఎల్‌డీ సామర్థ్యం గల వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సీఎస్‌ఆర్ కింద ఏర్పిటు చేయటానికి ఐన్‌ఫ్లాక్స్ వాటర్ సిస్టమ్ లిమిటెడ్‌కు అనుమతించే అనుకూలంగా తీర్మానం.
* శేరిలింగంపల్లి సర్కిల్‌లోని మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి గచ్చిబౌలీ రోలింగ్ హిల్స్ వరకు సెంట్రల్ మీడియం,ట్రాఫిక్ ఐలాండ్‌ను సీఎస్‌ఆర్ కింద ఒక సంవత్సరం నిర్వహించి, పది బోర్డులను ఏర్పాటు చేసుకునేందుకు ఆమోదం.
* నల్లగండ్ల ఫ్లైఓవర్ ట్రాఫిక్ ఐలాండ్‌లు, సెంట్రల్ మీడియంలను సీఎస్‌ఆర్ కింద సంవత్సరం పాటు నిర్వహించి, పది బోర్డులను ఏర్పాటు చేసుకనుందుకు అనుకూలంగా తీర్మానం.
* శేరిలింగంపల్లిలోని హాఫీజ్‌పేట మీదికుంటను అభివృద్ధి, పరిరక్షణ బాధ్యతలను మెస్సర్స్ ఫౌంటేన్ హెడ్ గ్లోబల్ స్కూల్‌కు కేటాయిస్తూ ఆమోదం
* ఎస్‌ఆర్‌డీపీ పథకానికి రూపే టర్మ్‌లోన్ కింద రూ. 2500 కోట్లను సేకరించేందుకు అరేంజర్‌గా ఎస్‌బీఐ క్యాప్స్‌ను 0.10 శాతం ఫీజుతో నియమించేందుకు స్థాయి సంఘం అంగీకారం.
* జీహెచ్‌ఎంసీ పరిధిలో బీఓటీ టాయిలెట్ల నిర్వహణను సఫాయి కర్మచారిలకు పదేళ్ల పాటు కేటాయించటం, టెండర్లలో పాల్గొనే మేతర,వాల్మీకి వర్గానికి చెందిన వారికి సెక్యూరిటీ డిపాజిట్‌ను రూ.50వేల నుంచి రూ.20 వేలకు తగ్గిస్తూ తీర్మానం
* సఫాయి కర్మచారిలకు రూ.10వేలుగా ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజును రూ.5వేలకు తగ్గింపు.
* హయత్‌నగర్ సర్కిల్ ఫతుల్లాగూడ డంప్‌యార్డువద్ధ హిందూ, ముస్లిం, క్రిస్టియన్లకు వేర్వేరుగా శ్మశానవాటికలను నిర్మించేందుకు రెండు ఎకరాల చొప్పున భూమిని కేటాయిస్తూ తీర్మానం.
* జీహెచ్‌ఎంసీలో న్యాక్ ద్వారా నియమితులై పనిచేస్తున్న 250 మంది ఔట్‌సోర్సింగ్ సైట్ ఇంజనీర్లు, ఇద్దరు సీనియర్ కన్సల్టెంట్ల సేవలను మరో సంవత్సరం పాటు పొడిగించేందుకు ఆమోదం.
* ఇబ్రహీంబాగ్ తారామతి భరాదారి నుంచి పెద్ద చెరువు వరకు రూ.3.90 కోట్ల వ్యయంతో సీవరేజీ బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్.
* నిజాంపేట రోడ్ నుంచి నిజాంపేట క్రాస్‌రోడ్డు మీదుగా బాచుపల్లి కమాన్ వరకు 30 మీటర్ల మేర ఉన్న రోడ్డు విస్తరణ కోసం 80 ఆస్తుల నుంచి స్థలాలను సేకరించేందుకు ఆమోదం.
* 2019-20 సంవత్సరం 14వ ఫైనాన్స్ కమిషన్ లక్ష్యాల నిర్థారణకు తీర్మానం.