హైదరాబాద్

అలరించిన గౌడియా నృత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి : శిల్పారామంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన గౌడియా నృత్య ప్రదర్శన అలరించింది. శిల్పారామం సృజన కల్చరల్‌తో పాటు లిటరరీ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. మహువా ముఖర్జీ, అయన్ ముఖర్జీ, రచనకార్, ప్రేమాంకిత ప్రదర్శించిన గణపతి వందన, అర్ధనారీశ్వరం, అల్పచారీ, దశమహా విద్యలు, శాంతి శ్లోకంను ప్రదర్శించి కనువిందు చేశారు. అనంతరం కళాకారులను సృజన కల్చర్, లిటరరీ ఆర్గనైజేషన్ చైర్‌పర్సన్ అంజనా చౌదరి సన్మానించారు.

మ్యాడ్‌హౌస్ వెబ్‌సిరీస్‌ను
ప్రారంభించిన నటి నిహారిక
ఖైరతాబాద్, సెప్టెంబర్ 22: సమాజంలో యువత ప్రతిరోజు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను తెలుపుతూ కొత్త తరహాలో నిర్మించిన మ్యాడ్‌హౌస్ సిరీస్ అందరికీ నచ్చుతుందని వర్ధమాన తర నిహారిక అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మ్యాడ్‌హౌస్ పేరుతో నిర్మించిన వెబ్‌సిరీస్‌ను విడుదల చేశారు. మహానగరంలోని వివిధ సమస్యలకు హాస్యాన్ని జోడించి రూపొందిస్తున్న సన్నివేశాల అద్భుతంగా ఉన్నాయని అన్నారు. వీటితో సమస్యలు సైతం పరిష్కారం అవుతాయన్న ఆశాభావం తనకు ఉందని చెప్పారు. కార్యక్రమంలో వందన, మహేష్, సుధాకర్ పాల్గొన్నారు.