హైదరాబాద్

విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆంధ్రప్రదేశ్ టూరిజం సాంస్కృతిక, యువజన క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస రావు అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అవంతి డీగ్రీ, పీజీ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి శ్రీనివాస రావు మాట్లాడుతూ ఇటీవల తెలంగాణలో ఇంటర్‌లో ఫెయిల్ అయ్యామని కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం బాధకరమని అన్నారు. అన్నింటికంటే మనిషి జీవితం గొప్పదని, సమస్యలను ఆత్మహత్య పరిష్కరం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మెన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా తాము ఎంచుకున్న లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టి దేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదగాలని అన్నారు. కార్యక్రమంలో సీ ఎం ఎ హైదరాబాద్ చాపర్ మాజీ చైర్మెన్ చంద్రశేఖర్ రాజనాల, విద్యావేత్త బీ.శివప్రసాద్, ఇన్ఫోసీస్ డైరెక్టర్ వై.జయప్రద, ప్రిన్సిపాల్ ఆచార్య పోచన్న, వెంకట్రావ్ పాల్గొన్నారు.