హైదరాబాద్

గాలి వానా బిభ త్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో సోమవారం శుక్రవారం సాయంత్రం మరోసారి ఉరుమలు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో భారీ వర్షం భీభత్సం సృష్టించింది. సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై చిరుజల్లులతో కూడిన ఓ మోస్తారు జల్లులు కురిశాయి. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టినా, నాలుగు గంటల తర్వాత ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. బలమైన గాలులు చాలా సేపు వీయటంతో పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడగా, కోఠి, కాచిగూడ, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, అశోక్‌నగర్, ఆదర్శ్‌నగర్, దోమల్‌గూడ తదితర ప్రాంతాల్లో కరెంటు తీగల తెగి రోడ్డుపై పడిపోయాయి. ఫలితంగా పలు ప్రాంతాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. బలమైన గాలుల కారణంగా ఎల్‌బీ స్టేడియంలోని ఫ్లడ్ లైట్ల టవర్ రోడ్డుపై కుప్పకూలి ఒకరు మృతి చెందగా, చాదర్‌ఘాట్‌లో మరొకరు మృతి చెందారు. పార్కింగ్ చేసి ఉంచిన పలు వాహానాలు ధ్వంసం కావటంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఘటన స్థలాన్ని బల్దియా కమిషనర్ దాన కిషోర్ సందర్శించారు. నిత్యం రద్దీగా ఉండే లక్డీకాపూల్‌లో ఓ హోర్డింగ్ కుప్పకూలింది. దోమల్‌గూడలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎగ్జిబిషన్ కోసం ఏర్పాటు చేసిన స్టాల్ షెడ్డు కూలింది. సాయంత్రం ఏడు గంటల నుంచి బోయిన్‌పల్లి, సికిందరాబాద్, పార్శిగుట్ట, ఇందిరాపార్కు, బషీర్‌బాగ్, లక్డీకాపూల్, మాసాబ్‌ట్యాంక్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిత్యం రద్దీగా ఉండే లక్డీకాపూల్, గాంధీనగర్, కవాడిగూడ, సికిందరాబాద్ స్టేషన్, ఒలిఫెంటా బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో వర్షం ఆగిన తర్వాత కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. చాలా కోట్ల కరెంటు సరఫరా నిల్చిపోవటంతో జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, డిజాస్టర్ రెస్క్యు ఫోర్సు బృందాలు అప్రమత్తమై, సహాయక చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ అధికారులను ఆదేశించారు.