హైదరాబాద్

నీటి సరఫరాకు రూ.870 కోట్లు ఖర్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేస్తే రోజు 20 మిలియన్ గ్యాలన్ల నీటిని ఆదా చేయచ్చని జలమండలి ఎండీ ఎం.దాన కిషోర్ తెలిపారు. ప్రత్యేకంగా వాక్ (నీటి నాయకత్వం - జల సంరక్షణ) అనే కార్యక్రమాన్ని రూపొందించామని వివరించారు. నెక్లెస్ రోడ్‌లోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా జలమండలి నిర్వహించిన వాక్ అలియన్స్ అనే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున నగరవాసులు, విద్యార్థులు దాదాపుగా ఐదువేల మంది వాలంటీర్లు పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ డీ.హరిచందన ప్రారంభ ఉపన్యాసం చేశారు. జలమండలి ఎండీ దాన కిశోర్ మాట్లాడుతూ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరికి గాలి, నీరు పట్ల హక్కు ఉందని వాటిని పొదుపుగా వినియోగించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. భూమి మీద ఉన్న మొత్తం నీటిలో 98 శాతం ఉప్పు నీరుగా కేవలం రెండు శాతం మంచినీటిగా ఉందని తెలిపారు. చెరువులు, నదుల్లో ఉందని వివరించారు. 50 సంవత్సర్లా క్రితం మంచినీటి చెరువుగా ఉన్న హుస్సేన్ సాగర్‌ను మనం చేస్తున్న కొన్ని పోరపాట్ల వల్ల నేడు ఆనీటిని వినియోగించలేక పోతున్నామని వివరించారు. వందల కిలో మటీర్ల దూరం నుంచి కృష్ణా, గోదావరి నదుల నుంచి నగరానికి ప్రతిరోజు రూ.50లక్షలు, ఏడాదికి రూ.850 కోట్లు ఖర్చు చేసి నగరానికి నీటిని తీసుకు వస్తే, ఆ నీటిలో 10 నుంచి 15 శాతం నీరు నగరవాసుల ఇళ్ల వద్ద వృథాగా పోతుందని తెలిపారు. ప్రతిరోజు రెండు కోట్ల లీటర్ల విలువైన నీరు వృథాగా పోతుందని తెలిపారు. భావి తరాలకు ఉత్తమ జీవనాన్ని అందించేందుకు ప్రకృతి సంపదను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వివరించారు. నీటిని పొదుపుగా వాడేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వాక్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ నగరానికి వందల కిలొ మీటర్ల నుంచి కృష్ణా, గోదావరి నదుల నుంచి మంచినీటి తరలింపు, జలమండలి పరిది విస్తరణ వంటి విషయాలను వివిరించారు. ప్రతిరోజు 20 మిలియన్ గ్యాలన్న నీటిని నగరవాసులు తమ ఇళ్ల వద్ద వృథాగా పోతున్నాయని వాటి ద్వారా దాదాపుగా 30 లక్షల మంది నీటి అవసరాలు తీర్చవచ్చని తెలిపారు. నెల రోజులుగా వాక్ కమిటీలు చేపట్టిన కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఎండీ దానకిషోర్ ప్రారంభించారు. నీటి పొదుపు, నీటి వృథాపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ట్రాన్స్‌మిషన్ డైరెక్టర్ డాక్టర్ పీ.సత్యసూర్యనారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ డి.శ్రీ్ధర్ బాబు. ఆపరేషన్ డైరెక్టర్ అజ్మీరా కృష్ణ పాల్గొన్నారు.