హైదరాబాద్

శాస్ర్తియ సంగీతాన్ని ఆదరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: శాస్ర్తియ సంగీతాన్ని ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ శాస్ర్తియ సంగీత విద్వాంసుడు డా.డీవీ మోహనకృష్ణ అన్నారు. కినె్నర ఆర్ట్ థియేటర్స్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ‘అంతా రామమయం’ పేరిట శాస్ర్తియ సంగీత మహోత్సవం సోమవారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మోహన కృష్ణ మాట్లాడుతూ, శాస్ర్తియ సంగీతం మహోత్సవం పేరిట ఐదు రోజులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రముఖ గాయనీ విష్ణుప్రియ భరద్వాజ్ ఆలపించిన శాస్ర్తియ సంగీతం అలరించింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు డా.వైజర్సు బాల సుబ్రహ్మణ్యం సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, గాయనీ సురేఖా మూర్తి, సంస్థ కార్యదర్శి మద్దాళి రఘురామ్ పాల్గొన్నారు.
అలరించిన సినీ సంగీత విభావరి
కాచిగూడ, ఏప్రిల్ 15: ప్రవీణ్ కల్చరల్ అసోసియేషన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి సోమవారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి లయన్ విజయ్ కుమార్, గానసభ అద్యక్షుడు కళా జనార్దన మూర్తి, సంస్థ అధ్యక్షుడు కే.దుర్గా ప్రసాద రావు పాల్గొని గాయనీ, గాయకులతో పాటు మాదిరెడ్డి రవీంద్రనాథ్ ఠాగూర్ దంపతులకు ఆత్మీయ సత్కారం చేశారు. గాయనీ, గాయకులు రేణుక, పవన్ కుమార్, జగధాత్రి, మోహన్, శివరామకృష్ణ, మానస, గంటి రామకృష్ణ, గంటి శైలజ, సాయి మేఘన అలపించిన హిందీ, తెలుగు గీతాలు అలరించాయి.