హైదరాబాద్

ఆకట్టుకున్న పౌరాణిక నాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: రాజీవ్ యువజన సేవా కల్చరల్ సంఘం, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకృష్ణ రాయబారంలోని ‘శయన దృశ్యం’ పౌరాణిక నాటక ప్రదర్శన సోమవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కళాకారులు హరినాథ్ (కృష్ణుడు), బాల నాగేశ్వర్ (దుర్యోధనుడు), కే.శివ ప్రసాద్ (అర్జునుడు) వేషధారణలో నిర్వహించిన నాటక ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమానికి గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి పాల్గొని కళాకారులను అభినందించి సత్కరించారు.

భిన్న రుచులకు నిలయం హైదరాబాద్
ఖైరతాబాద్, ఏప్రిల్ 15: భిన్న రుచులకు నిలయం హైదరాబాద్ నగరమని వర్ధమాన నటి మోనిష అన్నారు. సోమవారం బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన కాబారా డ్రైవెన్‌ను సంస్థ డైరెక్టర్ అబ్దుల్లాతో కలిసి ఆవిష్కరించారు. ప్రపంచంలోని నలుమూలలకు చెందిన వ్యక్తులు ఇక్కడ జీవిస్తుండటంతో వారి ఆహార పద్ధతులను ఇక్కడి ప్రజలకు అలవాటు చేశారని అన్నారు. దీంతో దేశంలోని ఏ నగరంలో లేనివిధంగా ఇక్కడ వివిధ దేశాలకు చెందిన ఆహారం లభిస్తుందని పేర్కొన్నారు. ఆహారప్రియులు మెచ్చే వంటకాలను అందించేందుకు డ్రైవెన్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు.
‘తెలుగే గొప్పభాష’ పుస్తకావిష్కరణ
కాచిగూడ, ఏప్రిల్ 15: ప్రముఖ రచయిత పారుపల్లి కోదండ రామయ్య రచించిన ‘తెలుగే గొప్ప భాష’ పుస్తకావిష్కరణ సభ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో సోమవారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలుగు భాష పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కోదండ రామయ్య తెలుగు భాష అభివృద్థికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా అధికార సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర రావు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఆచార్య డా. ఆవుల మంజులత, వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, వంశీ అధ్యక్ష, కార్యదర్శులు డా.తెనే్నటి సుధాదేవి, సుంకరపల్లి శైలజ పాల్గొన్నారు.