క్రైమ్/లీగల్

యువతులపై అఘాయిత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, కుషాయిగూడ, అక్టోబర్ 28: ఆధ్యాత్మికత ముసుగులో అమాయక యువతులకు మాదకద్రవ్యాలను అలవాటు చేసిన హోమీజేబాబా ఆశ్రమం వద్ద తల్లిదండ్రులు ఆందోళన చేశారు. యువతుల తల్లిదండ్రులు తెలిపిన కథనం ప్రకారం కాప్రా వంపుగూడలో ఆధ్యాత్మిక ఆశ్రమం పేరుతో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువతులను తీసుకొచ్చి బంధించినట్లు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆశ్రమంలో యువతులకు మాదకద్రవ్యాలను అలవాటు చేసి దైవం ముసుగులో అఘాయిత్యాలు చేస్తున్నారని విశ్వహింద్ పరిషత్ కార్యకర్తలకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
వంపుగూడ ఆశ్రమం వద్ద తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో యువతులను నిర్వాహకులు కీసర మండలం గోధుమకుంటలోని ఆశ్రమానికి తరలించినట్లు పేర్కొన్నారు.
విషయం తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు.. కీసర పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఆశ్రమంలోకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆందోళన చేశారు.ఆధ్యాత్మికత పేరుతో 22 సంవత్సరాల వయస్సు యువతులను తల్లిదండ్రులతో హోమీజేబాబా ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడకుండా, కలవకుండా అఘాయిత్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ యువతిని తొమ్మిది నెలల క్రితం దైవ సేవ పేరుతో రూ.4లక్షలు తీసుకుని వంపుగూడ ఆశ్రమానికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం వంపుగూడ ఆశ్రమానికి చేరుకుని యువతిని పలుకరించగా మాదకద్రవ్యాలతో కనిపించినట్లు తెలిపారు. వెంటనే విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలకు ఫిర్యాదు చేయడంతో ఆందోళన చేసినట్లు తెలిపారు.
10 మంది యువతులను విడిపించాం : సీఐ వెల్లడి
కీసర గోధుమకుంట హోమీజేబాబా ఆశ్రమంలో యువతుల తల్లిదండ్రులు ఆందోళన చేయగా ఆశ్రమంలోకి పోలీసులు వెళ్లి 10 మంది యువతులను విడిపించినట్లు సీఐ ప్రకాష్ తెలిపారు.