క్రైమ్/లీగల్

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 28: వారంతా పొట్ట కూటి కోసం పండించిన కూరగాయలను నగరానికి తీసుకెళ్లి విక్రయించుకొని జీవించే రైతు కూలీలు. రోజువారీగానే ఆదివారం తెల్లవారుఝామున కూరగాయలను ఆటోలో వేసుకొని విక్రయించుకునేందుకు నగరానికి బయలుదేరారు.
ఇబ్రహీంపట్నంలోని సాగర్ రహదారిపై అతివేగంగా వచ్చిన ఆర్టీసీ ఢీకొట్టింది. రైతు మృతిచెందగా, మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా మారగా, మరో 11 మంది గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఇబ్రహీంపట్నం సీఐ గురవా రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. యాచారం మండలం మొండిగౌరెళ్లి గ్రామానికి చెందిన 13 మంది రైతులు ఆటో ట్రాలీలో తాము పండించిన కూరాగాయలను వేసుకొని హైదరాబాద్‌కు బయలుదేరారు. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ సమీపంలోకి రాగానే వెనుకనుండి అతివేగంగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనిగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న మొండిగౌరెళ్లి గ్రామానికి చెందిన రైతు గోడుకొండ్ల యాదయ్య(55) తీవ్రగాయాలపాలై మృతిచెందగా, రైతులు మొగిలి జంగారెడ్డి, గుర్రం మధూకర్ రెడ్డి కాళ్ళు, చేతులు విరిగిపోవడంతో నగరంలోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. గుర్క రవీందర్, లక్ష్మమ్మ, గుడాల బాలమ్మ, మేకల కల్పనకు తీవ్రగాయాలు కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మర్రిపల్లి వినోద్‌కుమార్, కట్టెల మహేందర్, బొరిగె మహేందర్‌ను ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ బస్సు వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా పోలీసులు తెలిపారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.