క్రైమ్/లీగల్

యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, అక్టోబర్ 27: రైలు కింద పడి గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ రైల్వే పోలిస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ రాఘవేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం రైల్వే జంక్షన్ ఏ క్యాబిన్ వద్ద శనివారం 30 నుండి 35 సంవత్సరాల వయస్సున్న గుర్తుతెలియని యువకుడు గూడ్సు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు తెలు పు, నలుపు చుక్కల లుంగీ, తెలుపు, నలుపు గళ్ళ ఫుల్ షర్టు ధరించాడు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వృద్ధురాలి మృతి
ఆమనగల్లు, అక్టోబర్ 27: ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్లి గ్రామపంచాయతి పరిధిలోని గౌరారం గ్రామంలో జరిగిన ప్రమాదంలో కడ్తాల గ్రామానికి చెందిన వృద్ధురాలు పీ.వెంకటమ్మ 65 అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ ఐ మల్లేశ్వర్ తెలిపారు. అయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మృతురాలు వెంకటమ్మ తన బంధువుల ఇంటికి ఓ శుభకార్యానికి హజరై తిరిగి వెళ్తుండగా టీ 507 ఎఫ్ వై 3285 నెంబర్ గల ఎటాక్స్ కంకర సిమెంట్ కలిపే వాహనము డీ కొట్టగా వెంకటమ్మ మృతి చెందింది. మృతురాలి కుమారుడు కృష్ణా ఫీర్యాదు మెరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపు తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.

కారు డ్రైవర్ ఆత్మహత్య
ఉప్పల్, అక్టోబర్ 27: కుటుంబ సమస్యలతో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం బోడుప్పల్ మారుతీనగర్‌లో నివసిస్తున్న కే.శివ (28) కారు డ్రైవర్. అతడు గుంటూరుకు చెందిన సరస్వతిని మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం వీరి సంసారం సాఫీగా ఉన్నప్పటికీ ఇటీవల భార్యాభర్తల మధ్య సంసారం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. భార్య భర్తపై 498 కింద కేసు పెట్టడంతో కోర్టులో పెండింగ్ ఉంది. ఈ విషయంలో తీవ్ర మనస్థాపం చెందిన అతడు శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఫ్లై ఓవర్‌పై కారు బోల్తా
ఖైరతాబాద్, అక్టోబర్ 27: ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పై ఓ కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైన సంఘటన సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శనివారం ఉదయం సుమారు ఏడు గంటల ప్రాంతంలో ఖైరతాబాద్ జంక్షన్ నుంచి ఐ-మాక్స్ వైపు వెలుతున్న ఫోర్డ్ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొని అవతలి వైపు పడిపోయింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న వ్యక్తికి స్వల్పగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సైఫాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనతో ఫ్లై ఓవర్‌పై కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.