క్రైమ్/లీగల్

దోపిడీ దొంగల హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్, ఏప్రిల్ 9: సరూర్‌నగర్‌లో పట్టపగలు దోపిడీ దొంగలు హల్‌చల్ చేసారు. ఒంటరి మహిళ ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడి పారిపోయేందుకు యత్నించిన అగంతకులను స్థానికులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. గ్రీన్‌పార్క్ కాలనీ రోడ్ నెంబర్ 4లో ఆర్టీసీ ఉద్యోగి కొంతం ప్రభాకర్ రెడ్డి నివసిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం ప్రభాకర్ రెడ్డి భార్య సునీతా రెడ్డి ఇంట్లో ఒంటరిగా ఉన్నపుడు ఇద్దరు అగంతకులు చొరబడి సునీతను కత్తులతో బెదిరించి చేతులు కట్టేసారు. బీరువాలోని నగదు, బంగారు ఆభరణాలు తస్కరించి బయటకు వెళ్తున్న సమయంలో కుమారుడు సాత్విక్ రెడ్డి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో నుంచి అనుమానాస్పద వ్యక్తులు బయటికి వస్తుండడం, లోపల సామాన్లు చెల్లాచెదురుగా పడిఉండడాన్ని చూసి అప్రమత్తమై దొంగలు.. దొంగలు.. అంటూ కేకలు వేసాడు. అతని కేకలతో పారిపోతున్న దొంగలను స్థానికులు ద్విచక్ర వాహనాలపై వెంటాడి పట్టుకున్నారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులకు దొంగలను అప్పగించిన ట్లు సమాచారం. దోపిడీ జరిగిన తీరు ను పోలీసులు పరిశీలించారు. సునీతా రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కత్తులతో బెదిరించిన దొంగలు ఇంటి నుంచి రూ.5లక్షల విలువ చేసే 15తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదు తస్కరించినట్లు పోలీసులు తెలిపారు. దోపిడీలో మొత్తం నలుగురు అగంతకులు పాల్గొన్నట్లు తెలుస్తుంది. కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.