క్రైమ్/లీగల్

సుపారీల ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంద్రనగర్, ఏప్రిల్ 9 : నగరంలోని పలు ప్రాంతాల్లో సుపారీలు తీసుకొని హత్యలు, చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్ డీసీపీ పద్మజా రెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. రాజేంద్రనగర్‌లోని గురుద్వార్‌లో పూజారిగా పని చేస్తున్న సర్దార్ జితేందర్ సింగ్, చాంద్రాయణ గుట్ట అషామాబాద్ ప్రాంతానికి చెందిన మహ్మద్ జబ్బార్, శాస్ర్తిపురానికి చెందిన అబ్ధుల్ అజార్, ఉప్పర్‌పల్లి పోర్ట్ వ్యూ కాలనీలో ఉండే షేక్ వాహేద్, వౌలాలీలో ఉండే మహ్మద్ ఇబ్రహీం, చాంద్రాయణగుట్ట అషామాబాద్ ప్రాంతానికి చెందిన మహ్మద్ సయ్యద్ స్నేహితులు. గతంలో వౌలాలీ ప్రాంతానికి చెందిన గోపాల కృష్ణను చంపడానికి పది లక్షల రూపాయలు సుపారీ తీసుకొని 2016 సంవత్సరంలో హత్య చేశారు. ఈ ముఠా ఆ కేసులో అరెస్ట్ అయినప్పుడు మూడు దేశావళి పిస్టల్‌లు, ఒకటి మాత్రమే పోలీసులకు అప్పజెప్పారు. ఆదివారం రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో అనుమానస్పదంగా తిరుగుతున్న జితేందర్ సింగ్, జబ్బార్, అజార్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా వారి నుంచి ఒక పిస్టల్, రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకోగా మిగతా ముగ్గురు నిందితుల నుంచి ఒక దేశావళి పిస్టల్, రెండు లైవ్‌బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు సభ్యుల ముఠా నగరంలో విధ్వంసం సృష్టించడానికి పథకం వేసినట్లు తెలుస్తుంది.
వీరిని పట్టుకున్న వారిలో ఎన్‌వోటీ అడిషనల్ డీసీపీ దయానంద్‌రెడ్డి, శంషాబాద్ ఎస్‌వోటీ టీం, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ సీఐలు జగదీశ్వర్, సురేష్ ఉన్నారు.