క్రైమ్/లీగల్

మహిళ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్, ఏప్రిల్ 3: నగరంలో మరో కలకలం.. దుండగులు చెలరేగిపోయారు. మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు కెమికల్ పోసి నిప్పంటించి హత్యచేశారు. సంజీవరెడ్డినగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన తీవ్ర అలజడి రేకెత్తించింది. పోలీసుల కథనం ప్రకారం బెంగళూరుకు చెందిన సౌమ్యకు, ఆరేళ్ల క్రితం విశాఖకి చెందిన నాగభూషణంతో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. యూసఫ్‌గూడ మెట్రో రైల్వేస్టేషన్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న నాగభూషణం ఎర్రగడ్డ శంకర్‌లాల్‌నగర్‌లోని సూరజ్ ఆర్కేడ్ ప్లాట్ నెంబర్ 104లో నివాసం ఉంటున్నారు. రోజులాగే సోమవారం రాత్రి 8 గంటలకు విధులకు హాజరయ్యేందుకు నాగభూషణం వెళ్లాడు. రాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో వారు నివాసం ఉండే ఫ్లాట్ నుంచి దట్టమైన పొగలు వస్తుండటాన్ని పక్క ఫ్లాట్‌లోని విశాల్ గమనించాడు. మంటలు ఆర్పేందుకు ఫ్లాట్‌లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా బయటి నుంచి గడియపెట్టి ఉంది. వెంటనే తెరిచి లోనికి వెళ్లి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించగా అదుపులోకి రాలేదు. అప్పటికే మంటల్లో ఉన్న తల్లి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న బాలుడిని రక్షించి అపార్ట్‌మెంట్ వాసులకు సమాచారం అందించాడు. వారంతా కలిసి నీరు పోసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా అదుపులోకి రాకపోవడంతో ఇసుక చల్లి మంటలను ఆర్పివేశారు.అసిస్టెంట్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ విజయ్‌కుమార్ అక్కడికి చేరుకొని వివరాలు తెలుసుకుని, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లను రప్పించి వివరాలు సేకరించారు. సౌమ్య భర్తను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న పోలీసులు సౌమ్య కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అనంతగిరి ఘాట్‌రోడ్డులో లారీ బోల్తా
వికారాబాద్, ఏప్రిల్ 3: లారీ అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. వివరాలలోకి వెళితే పౌరసరఫరాల శాఖ బియ్యం తీసుకెళుతున్న లారీ మంగళవారం అనంతగిరి ఘాట్ రోడ్డులో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న దాదాపు 16 టన్నుల బియ్యం చెల్లాచెదురుగా పడిపోయాయి. డైవర్ చాకచక్యంగా వ్యవహరించి కిందకు దూకడంతో ప్రాణాలు కాపాడుకున్నాడు. హైదరాబాద్ నుంచి తాండూర్ వెళుతుండగా ఘటన నందిఘాట్ వద్ద జరిగింది.