క్రైమ్/లీగల్

దొంగతనాలకు పాల్పడుతున్న మహిళ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం,మార్చి 20: ఒంటరిగా ఉన్న మహిళలను బెదిరించి దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా మహిళా దొంగను రాచకొండ పాలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమె వద్ద నుంచి 30తులాలు బంగారు ఆభరాణాలను స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్‌లోని రాచకొండ సీపీ కాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ నెల్లూరు ప్రాంతానికి చెందిన రమణమ్మ అలియాస్ శ్యామల తిరుపతి, శ్రీశైలం,యాదాద్రి ప్రాంతాలకు దైవదర్శనాల కోసం వచ్చే ఒంటరి మహిళలను లక్ష్యంగా పెట్టుకుని వారి నమ్మించి వారితో స్నేహం చేస్తూ దొంగతనాకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతోంది. సదరు మహిళపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలోని పలు పోలీసుస్టేషన్లలో 16 కేసులు నమోద య్యాయి. కొన్నిరోజుల క్రితం భువనగిరి ప్రాం తానికి చెందిన ప్రమీల అనే మహిళ ఒంటరిగా ఆర్టీసీ బస్సులో భువనగిరి నుంచి ఉప్పల్ వైపు వెళ్తోంది. అదే బస్సులో ప్రయాణం చేస్తున్న రమణమ్మ ప్రమీలతో పరిచయం చేసుకుని ఆమె వద్ద ఉన్న బంగారాన్ని దొంగిలించి పారిపోయింది. వెంటనే ప్రమీల ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.సీసీ పుటేజీల ఆధారంగా మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు సోమవారం రాత్రి రమణమ్మను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె వద్ద ఉన్న 30 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్టు సీపీ వెల్లడించారు.

భారీగా ఆభరణాలు స్వాధీనం
* చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు
హైదరాబాద్, మార్చి 20: స్టార్ హోటళ్లకు వచ్చే కస్టమర్లను టార్గెట్ చేసుకొని భారీ చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కమిషనర్ అంజనీ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన జయేష్ రావ్‌జీ సేత్‌పాల్ (46) పాత నేరస్థుడు. దేశంలోని వివిధ నగరాల్లోని ఐదు నక్షత్రాల హోటళ్లకు గెస్ట్‌గా వెళ్లి తన గదికి ఇరువైపులా ఉండే ఇతర గెస్ట్‌ల వివరాలను తెలుసుకుంటాడు. ఈనెల 5, 6తేదీల్లో బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్‌కు దర్జాగా ఒలకబోస్తూ వచ్చిన జయేష్ హోటల్‌లో బస చేస్తున్న వారి వివరాలను తెలుసుకున్నాడు. రూమ్‌నెంబర్ 312లో ఉంటున్న నూతన దంపతులను టార్గెట్ చేసుకున్నాడు. నవ దంపతులు హోటల్ నుంచి బయటకు వెళ్లిన అనంతరం తమ గది సంబందించిన యాక్సెక్ కార్డు కనిపించడం లేద ని, మరో కార్డు ఇవ్వాలని వినయపూర్వకంగా కోరాడు. ఇది నిజమని నమ్మిన సిబ్బంది మరో కార్డును అందించారు. దాని సహాయంతో గదిలోకి ప్రవేశించి అందులోని ఖరీదైన వజ్రాభరణాలను చోరీ చేసుకొని వెళ్లిపోయాడు. వారు ఆభరణాలు చోరికి గురి అయినట్టు గుర్తించి హోటల్ సిబ్బందిని నిలదీశారు. వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో నాలుగు బృందాలును ఏర్పాటు చేశారు. మరో హోటల్‌లో ఇదే తరహాలో చోరీ చేసే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అతడిని అదుపులోనికి తీసుకొని ప్రశ్నించగా తనకేమి తెలిదయని పారిపోయే ప్రయత్నం చేశాడు. అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి పూర్తిస్థాయిలో విచారించడంతో తానే చేశానని ఒప్పుకున్నాడు. దీంతో ఇతని వద్ద ఉన్న రూ. 30లక్షల విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. స్టార్ హోటళ్లకు వెళ్లే వారు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచిస్తున్నారు.