బిజినెస్

సేఫ్ వాటర్ నెట్‌వర్క్, హనీవెల్ దోస్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: తెలంగాణలో సురక్షితమైన త్రాగునీటిని అందించడానికి సేఫ్ వాటర్ నెట్‌వర్క్, హనీవెల్ చేతులు కలిపాయి. వినియోగదారులకు అందుబాటు ధరలో స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తామని ఇరు సంస్థలు గురువారం ఇక్కడ స్పష్టం చేశాయి. హనీవెల్ ఇండియా గ్రాంట్, సేఫ్ వాటర్ నెట్‌వర్క్ నిధులతో 25 ఐజల్ సేఫ్ వాటర్ స్టేషన్లని కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 2017 వరకు నిర్మించనున్నారు.

డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ విలువ
రూ. 8 వేల కోట్లు
ఐడిఎస్‌ఎ-పిహెచ్‌డి వార్షిక సర్వే
హైదరాబాద్, డిసెంబర్ 10: భారతీయ ప్రత్యక్ష అమ్మకపు పరిశ్రమ (డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ) గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో 7,958.3 కోట్ల రూపాయలకు చేరిందని ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ (ఐడిఎస్‌ఎ), పిహెచ్‌డి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కలిసి విడుదల చేసిన ఓ వార్షిక సర్వే నివేదికలో తేలింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2013-14)లో ఇది 7,472.2 కోట్ల రూపాయలుగా ఉందని గురువారం పేర్కొన్నాయి.

ఈపమ్ చేతికి
అలయెన్స్ గ్లోబల్ సర్వీసెస్
హైదరాబాద్, డిసెంబర్ 10: ప్రోడక్ట్ డెవలప్‌మెంట్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్ గ్లోబల్ ప్రొవైడర్, అమెరికాకు చెందిన ఈపమ్ సిస్టమ్స్.. అలయెన్స్ గ్లోబల్ సర్వీసెస్‌ను సొంతం చేసుకుంది. ఈ మేరకు గురువారం ఈపమ్ సిస్టమ్స్ విలేఖరులకు తెలిపింది. అలయెన్స్ గ్లోబల్ సర్వీసెస్‌లో ప్రస్తుతం 1,100 ఇంజినీర్లున్నారు. హైదరాబాద్, పుణెల్లో ఆ సంస్థ భారతీయ డెలివరీ సెంటర్లున్నాయి.

ఇక ఇంటివద్దే ల్యాబ్‌పరీక్షలు
అందుబాటు ధరల్లో అందించనున్న మెడ్‌ప్లస్
హైదరాబాద్, డిసెంబర్ 10: మెడ్‌ప్లస్ గురువారం ఇక్కడ మెడ్‌ప్లస్ ల్యాబ్.కామ్‌ను ప్రారంభించింది. చౌక ధరలకు ఇంటి వద్దనే టెస్టులను చేయించుకోవచ్చని విలేఖరులకు తెలిపింది. ఇంటర్నెట్, మొబైల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆయా సేవలు పొందవచ్చని, బ్లడ్, బాడీ ఫ్లూయిడ్ టెస్టింగ్‌తోపాటు రేడియాలజీ, స్కానింగ్ సేవలనూ అందిస్తామన్నారు.

ఇంధన పొదుపులో ఆంధ్రప్రదేశ్‌కు
ఐదు జాతీయ అవార్డులు
హైదరాబాద్, డిసెంబర్ 10: విద్యుత్ ఆదా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న విశిష్టకృషికి గుర్తింపుగా ఏపి ఇంధన సంరక్షణ సంఘానికి ఐదు ప్రతిష్ఠాత్మకమైన జాతీయ అవార్డులు లభించాయి. ఈ ఐదు అవార్డుల్లో ఒకటి ఇంధన సంరక్షణ సంఘానికి, ఏపి సదరన్ పవర్ డిస్కాంకు రెండు, గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థకు రెండు లభించాయి.

తెలంగాణ సదరన్ పవర్ డిస్కాంకు
ప్రతిష్ఠాత్మక అవార్డు
హైదరాబాద్, డిసెంబర్ 10: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగంలో స్మార్ట్ మీటరింగ్, ఐఆర్‌డిఐఏ లేదా ఐఆర్ ద్వారా అటోమేటిక్ స్పాట్ బిల్లింగ్ విధానాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు తెలంగాణ సదరన్ పవర్ డిస్కాంకు ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు లభించింది.