బిజినెస్

హైకోర్టు ఆదేశించినా.. మారని బట్టీ కార్మికుల బతుకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి, డిసెంబర్ 28: అన్ని రకాల సౌకర్యాలు కల్పించే వరకు ఇటుక బట్టీల్లో కార్మికులతో పని చేయించ రాదని సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా, ఇటుక బట్టీల యజమానులు పెడచెవిన పెడుతున్నారు. ఇటీవల ఇటుక బట్టీలలో యజమానుల దాష్టీకానికి ఓ మహిళా కార్మికురాలు మృత్యువాత పడటంతో అధికార యంత్రాంగం ఇటుక బట్టీలను సందర్శించి మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పెద్దగా స్పందన కనిపించకపోవడంతో పౌర హక్కులు, మానవ హక్కుల నేతలు ఇటుక బట్టీ కార్మికుల బతుకులపై హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బట్టీల నిర్వాహకులు బట్టీల పక్కనే నివాసాలు నిర్మించారు. అయతే అవి ఇరుకైన గదులతో, చాలీచాలని స్నానాల గదులతో ఏర్పాటు చేశారు. కార్మికుల పిల్లల కోసం ఇంకా పాఠశాలలు కూడా నిర్వహించడం లేదు. వాహనాల ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు తరలిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే బట్టీలలో కాస్త సౌకర్యాలు మెరుగైనా, పూర్తిస్థాయిలో ఏర్పాటుకు యజమానులు ముందుకు రావడం లేదు. అలాగే ఇటుక బట్టీలలో కార్మికుల శ్రమ దోపిడీ ఇంకా కొనసాగుతోంది. పనికి తగిన వేతనం ఇవ్వాలని కార్మిక చట్టా లు చెబుతున్నా.. ఇక్కడి యజమానులు తక్కువ కూలీ చెల్లించి ఎక్కువ పని చేయించుకుంటున్నారు. దీంతో రెవెన్యూ, కార్మిక, ఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు బట్టీలను సందర్శించి, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయ.