క్రైమ్/లీగల్

కుటుంబ కలహాలతో కూతురు, తల్లి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజుపాలెం, ఏప్రిల్ 9: కుటుంబ కలహాలతో తల్లి ఆత్మహత్య చేసుకోవడమే కాక కూతురికి పాలల్లో విషం కలిపి ఇద్దరూ మృతిచెందిన సంఘటన మండలంలోని గణపవరం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు... బుడుగు వెంకట్రావ్, విజయలక్ష్మిలకు నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక ఆడ సంతానం కలిగింది. గత సంత్సరం నుండి భార్యభర్తల మధ్య కుటుంబ కలహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వంట సరిగా లేదని భర్త భార్యపై ఘర్షణకు దిగాడు. తన కుమార్తె ధనలక్ష్మి (3)కి పాలల్లో విషం కలిపి కూతురు చనిపోయిన వెంటనే తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయమై ఇప్పటివరకు పోలీసుస్టేషన్‌లో ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ రమేష్ తెలిపారు.

అతిసారతో చిన్నారి మృతి
* నారాయణపురంలో నీరు కలుషితం
* 20మందికి అస్వస్థత
దాచేపల్లి, ఏప్రిల్ 9: దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామంలో సోమవారం మంచినీరు కలుషితం కావడంతో 20మంది అస్వస్థతకు గురికాగా అతిసార వ్యాధితో సయ్యద్ హాస్మా(5) అనే బాలిక మృతి చెందింది. బాలిక తల్లి సయ్యద్ జైనా విలేఖరులతో మాట్లాడుతూ హస్మాకు ఆదివారం రాత్రి నుండి వాంతులు, విరోచనాలు అవుతున్నాయని చెప్పింది. బాలికను స్థానికంగా వైద్యులకు చూపించి సోమవారం ఉదయం మెరుగైన చికిత్స కోసం పిడుగురాళ్ళ తీసుకువెళదాం అనుకునే లోపు బాలిక మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా గ్రామంలో మంచినీరు కలుషితం కావటం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సమీపంలోని నాగులేరు వాగు మురికి కూపంగా మారటంతో నీరు కలుషితం అయినట్లు వారు చెప్పారు. కాగా ఈ సంఘటనతో స్పందిచిన వైద్య సిబ్బంది గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి అతిసార బాధితులకు మందులు పంపిణీ చేశారు. పంచాయతీ సిబ్బంది పరిసరాలను శుభ్రం చేశారు.

రూ.2.50 లక్షల ఆస్తి నష్టం
మాచర్ల రూరల్, ఏప్రిల్ 9: మండల పరిధిలోని గన్నవరంలో సోమవారం నిద్రిస్తున్న మేకలపై కుక్కలు చేసిన దాడిలో 42 మేకలు మృతిచెందాయి. వివరాలిలావున్నాయి. గ్రామానికి చెందిన కామనబోయిన అంకారావు, గురులింగం, ముత్తయ్య, శివయ్య, బ్రహ్మయ్య గ్రామ శివారులో దొడ్లు ఏర్పాటు చేసుకొని మేకలను మేపుకుంటున్నారు. సోమవారం ఉదయం గ్రామంలో ఊర కుక్కలు స్వైర విహారం చేస్తూ వారి దొడ్లలో ఉన్న 42 మేకలపై దాడి చేసి చంపాయి. వీటి విలువ సుమారు 2.50 లక్షలు ఉంటుందని గొర్రెల కాపరులు తెలిపారు. మేకలకు గిరాకి ఉన్న సమయంలో ఇలా జరగటం దురదృష్టకరమని వారు వాపోతున్నారు.