నాలుగు భాషల్లో మహేష్ చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా తరువాత ఆయన నటించే మరో సినిమాకు అప్పుడే సన్నాహాలు మొదలయ్యాయి. తమిళ క్రేజీ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా కోసం మహేష్ కూడా చాలా ఆసక్తిగా వున్నాడట! దానికి కారణం ఈ సినిమా తెలుగు, తమిళం కాక మరో రెండు భాషల్లో ఒకేసారి షూటింగ్ జరగబోతోందట. సామాజిక స్పృహ గల చిత్రాలు తీయడంలో దిట్ట అయిన మురగదాస్ ఈ సినిమా కోసం భారతీయ న్యాయవ్యవస్థపై కత్తిలాంటి కథను సిద్ధం చేశారట. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతాన్ని సమకూర్చుతుండగా, సంతోష్ శివన్ కెమెరా అందిస్తున్నాడు. బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుంది. హీరోయిన్, ఇతర నటీనటులను వచ్చే నెలలో ఖాయం చేసుకుంటారు. శ్రీమంతుడు సినిమాతో తమిళంలోను మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న మహేష్ ఈసారి మరో రెండు భాషల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు మరి.