ఈ వారం స్పెషల్

సూపర్‌మూన్ వస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందమామ రావే..
జాబిల్లి రావే...
కొండెక్కి రావే..
కోటిపూలు తేవే...
-అని ఎవరైనా పిలిచారో ఏమో...
వచ్చేస్తున్నాడు పూర్ణచంద్రుడు మనచెంతకు...
మనవారి పిలుపు విని ఉబ్బితబ్బిబ్బయ్యాడో ఏమో..
ఎప్పటికన్నా పెద్దగా కన్పించబోతున్నాడు..
పిల్లల మోముల్లో వెలుగు చూశాడో ఏమో
అతడి మోమూ దివ్యకాంతులు విరజిమ్మబోతోంది.

భూమికి దగ్గరగా, ఎప్పటికన్నా పెద్దదిగా, ఎన్నడూలేనంత కాంతివంతంగా కనిపించబోతున్నాడు మన చంద్రుడు. అందుకే- ఈ పెద్దచంద్రుడిని అందరూ ‘సూపర్‌మూన్’ అని పిలుస్తున్నారు. ఖగోళంలో ‘సూపర్‌మూన్’ కొత్తేమీ కాదు. ఏడాదిలో కనీసం పదమూడుసార్లు ‘సూపర్‌మూన్’ ఉదయిస్తుంది. కానీ, ఇప్పుడు కనిపించబోతున్న చంద్రుడు అలాంటిలాంటివాడు కాదు. డెబ్భై ఏళ్ల క్రితం కన్పించినంత.. మళ్లీ పందొమ్మిదేళ్లకు కానీ కన్పించనంత సైజులో, వెలుగులో రాబోతున్నాడు. అందుకే కళ్లింత చేసుకుని చూస్తోంది అతడి రాకకోసం ప్రపంచం. స్కైవాచర్స్, ఖగోళ శాస్తవ్రేత్తలు, సాధారణ పౌరుల చూపు నవంబర్ 14న వచ్చే సూపర్ ఫుల్‌మూన్ కోసం ఎదురు చూస్తున్నారు.
సూపర్‌మూన్ అంటే..
భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూంటాడు కదా. అయితే చంద్రుడు తిరిగే కక్ష్య వృత్తాకారంలో ఉండదు. అందువల్ల చంద్రుడు తిరిగే మార్గాన్ని బట్టి భూమికి,చంద్రుడికి మధ్య దూరం నెలనెలకు మారుతూంటుంది. పౌర్ణమి నాడు లేదా చంద్రుడి కళలు మొదలైననాడు చంద్రుడు భూమికి దగ్గరగా వస్తే అప్పుడు ఆ చంద్రుడిని ‘సూపర్‌మూన్’ అంటారు. సాధారణంగా ఏడాదిలో 13 సార్లు సూపర్‌మూన్ వస్తూంటుంది. పౌర్ణమినాడు వస్తే కాస్త పెద్దగా, మరికాస్త కాంతివంతంగా చంద్రుడు కనిపిస్తాడు. భూమికి చంద్రుడు అతిదగ్గరగా వచ్చినపుడు కన్పించే పూర్ణచంద్రుడిని సూపర్‌మూన్‌గా చెప్పుకోవచ్చు. ఇది చాలామందికి ఆసక్తి కలిగించే అంశం. ఖగోళ పరిశోధకులకు ఇది స్ఫూర్తిని కలిగించే సంఘటన. అలా భూమికి చంద్రుడు అతి దగ్గరగా వచ్చే దూరం కనీసం 2.2లక్షల మైళ్లు. దీనిని ఖగోళ పరిభాషలో ‘పెరిజీ’ అంటారు. భూమికి అతిదూరంగా వెళ్లినపుడు కన్పించే సూక్ష్మచంద్రుడిని మైక్రోమూన్ అంటారు. ఇది ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని, పట్టించుకోని పరిణామం. నిజానికి శాస్ర్తియంగా ‘సూపర్‌మూన్’ అన్న పదం లేనేలేదు. ఇది వాడుకభాషలోని పదం. ఖగోళశాస్త్రం ప్రకారం ‘పెరిజి-సిజిగి’ అంటే సూపర్‌మూన్ అన్నమాట. ఈ సూపర్‌మూన్ అన్న పదాన్ని ఖగోళ శాస్తవ్రేత్త రిచర్డ్ నొల్లె 1979లో వాడాడు. అప్పటి నుంచి అదే పదం ప్రపంచానికి అలవాటైపోయింది. ఇప్పుడు అందరూ దానినే వాడుతున్నారు.
సూపర్ మూన్ ప్రత్యేకత?
నవంబర్ 14న వచ్చే సూపర్‌మూన్‌కు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారంగా వచ్చే సూపర్‌మూన్ మామూలు పౌర్ణమి చంద్రుడి కన్నా ఏడురెట్లు పెద్దదిగాను, ప్రకాశవంతంగానూ కనిపిస్తాడు. కానీ ఈ సూపర్ ఫుల్‌మూన్ మామూలు పూర్ణచంద్రుడికన్నా 14శాతం పెద్దదిగాను, 30శాతం కాంతివంతంగాను కన్పిస్తుంది. భూమికి ఇంత దగ్గరగా చంద్రుడు వచ్చిన సంఘటన 1948లో జరిగింది. మళ్లీ ఇంత దగ్గరగా వచ్చే సంఘటన 2034 నవంబర్ 25న జరుగుతుంది. నిజానికి ఈ ఏడాది సూపర్‌మూన్ మూడుసార్లు వస్తోంది. అక్టోబర్ 16న ఒకసారి సూపర్‌మూన్ ఏర్పడింది. అయితే అప్పుడు ఉల్కలవర్షం కూడా తోడైంది. నవంబర్ 14న సూపర్ ఫుల్‌మూన్ ఏర్పడుతోంది. మూడోది డిసెంబర్ 14న కనిపిస్తుంది. 2017లో సూపర్‌మూన్‌లు ఏర్పడకపోవడం విశేషం. సగటున 13వారాలకు ఓ సూపర్‌మూన్ సంభవించడం పరిపాటి. సూపర్‌మూన్ నాడు చంద్రుడు పెద్దగా కన్పిస్తాడన్నది నిజమే. కానీ శీతాకాలంలో ఏర్పడే సూపర్‌మూన్ మరింత స్పష్టంగా, కాంతివంతంగా గోచరిస్తుంది. చంద్రదోయం సమయంలో చంద్రుడు ఎర్రగా కన్పిస్తాడు. వాతావరణ కాలుష్యం, సరళరేఖకు సమాంతరంగా చూడటం వల్ల పెద్దగా, ఎర్రగా కనిపిస్తాడు. అదే నడినెత్తికి వచ్చేకొద్దీ తెల్లగా కన్పిస్తాడు. పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా అల్లోన్వ్కిన్ తెగకు చెందిన గిరిజనులు ఈ సూపర్‌మూన్‌ను ‘బీవర్స్ మూన్’, ‘హంటర్ మూన్’ అని సంబోధిస్తారు. వన్యప్రాణులను పట్టుకునేందుకు వలలు పనే్నందుకు, వేటాడేందుకు ఆ వేళ ప్రయత్నిస్తారు. భారతదేశంలో నవంబర్ 14 ఉదయం నుంచే సూర్యుడు పెద్దదిగా కనిపిస్తాడు. రాత్రి 7 గంటల సమయంలో పూర్తిస్థాయి బింబాన్ని చూడొచ్చు. హాంకాంగ్‌లో 9 గంటలకు బాగా కనిపిస్తాడు. భూమికి దగ్గరగా చంద్రుడు దాదాపు రెండున్నర గంటలపాటు సంచరిస్తాడు. అందువల్ల సుదీర్ఘ సమయం పాటు చంద్రుడిని మనం కళ్లారా చూసే అవకాశం ఉంది. నవంబర్ 14న వచ్చే సూపర్ ఫుల్‌మూన్‌ను ‘నాసా’ ఎక్స్‌ట్రా సూపర్‌మూన్‌గా అభివర్ణిస్తోంది. 21వ శతాబ్దంలో వచ్చే అతిపెద్ద సూపర్‌మూన్‌గా చెబుతోంది. యుటిసి కాలమాన ప్రకారం ఆ రోజు 1.52 పిఎం, యూరోపియన్ టైమ్ ప్రకారం 8.52, ఆసియా టైమ్ ప్రకారం 9.52 పిఎంలో చంద్రుడు పెద్దగా కనిపిస్తాడని ళ్ఘూఆ్దఒరీక.్య ఛెబుతోంది. స్లూహ్ అబ్జర్వేటరీ ఈ సూపర్‌మూన్ ఉదయించడాన్ని, ప్రయాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ప్రయత్నిస్తోంది.
శాస్తవ్రేత్తల ఉత్సాహం
చంద్రుడిపై కాలుమోపాలని, శాశ్వత ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలని, వీలైతే నివాసం ఉండాలని మానవుడు కలలుగంటున్నాడు. చంద్రుడిపై దిగేందుకు ప్రయత్నాలూ మొదలైనాయి. మనం కూడా చంద్రయాన్ పేరిట ప్రయోగాలు చేస్తున్నాం. చైనా, జపాన్, అమెరికా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు మొదలైనాయి. ఇప్పుడు సూపర్‌మూన్ సందర్భంగా మరింత సునిశితంగా చంద్రుడిని పరిశీలించేందుకు ఖగోళ శాస్తవ్రేత్తలు సిద్ధమవుతున్నారు. చంద్రుడిని స్పష్టంగా, నిశితంగా పరిశీలించడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను కనిపెట్టి అక్కడికి పరిశోధకులు పయనమవుతున్నారు. ఈ విషయంలో చైనా అత్యంత ఆసక్తిని ప్రదర్శిస్తోంది.
అలల అలజడి!
సూపర్‌మూన్ సందర్భంగా ఉపద్రవాలేవీ ముంచుకురావు. కాకపోతే సాధారణ రోజుల్లో ఉండే సముద్ర అలల ఉద్ధృతి కన్నా పున్నమినాడు వాటి అలజడి ఎక్కువగా ఉంటుంది. సూపర్‌మూన్ సందర్భంగా ఆ అలజడి మరింత ఎక్కువగా ఉంటుంది. సూర్యచంద్రుల గురుత్వాకర్షణ ఫలితం వల్ల అలా ఉంటుంది. సూపర్‌మూన్ సందర్భంగా ఉల్కలవర్షం ఉంటే కాస్త భిన్నమైన,ఆసక్తికరమైన దృశ్యాలు కన్పిస్తాయి. గత సూపర్‌మూన్ సందర్భంగా ఆ అనుభవం ఎదురైంది. ఈ సూపర్‌మూన్‌కు ఆ అవకాశం లేదు. డిసెంబర్‌లో వచ్చే సూపర్‌మూన్‌కు ఉల్కల మెరుపులు తోడవుతాయని అంటున్నారు. సూపర్‌మూన్ సందర్భంగా ‘జియోఫిజికల్ స్ట్రెస్’ ఉంటుందని ఖగోళ శాస్తవ్రేత్తలూ అంటున్నారు. అది సాధారణమేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. విద్యుద్దీపాల ఆర్భాటాలకు, కాలుష్య మేఘాలు అలుముకున్న ప్రాంతాలకు దూరంగా, స్వచ్ఛమైన గాలి ఉన్న ప్రాంతాల్లో కార్తీక పూర్ణచంద్రుడి విశ్వరూపాన్ని దర్శించుకోవడం అదృష్టమే. అదో అద్భుత అవకాశమే.
-రవళి/ బి.శ్రీధర్

చూడాల్సిందే... అప్పుడు మిస్సయ్యా...

‘సూపర్‌మూన్ ఆకర్షణీయంగానే ఉంటుంది. కాలుష్యం అడ్డుపడకపోతే ఆ దృశ్యం మనోహరంగా ఉంటుంది. ఖగోళంలో ఇలాంటి ‘దృశ్యం’ ప్రతి పది పదిహేనేళ్లకోసారి కన్పిస్తూంటుంది. వీటివల్ల విపరిణామాలేం ఉండవు. దిల్లీలో కాలుష్యం వల్ల గతంలో వచ్చిన సూపర్‌మూన్‌ను చూడలేకపోయా. ఇప్పుడు ఆ పూర్ణచంద్రుడిని తనివితీరా చూద్దాం’ అంటున్నారు శాస్తవ్రేత్త సిద్ధార్థ. నవంబర్ 14న రానున్న సూపర్‌మూన్ పై ఆయనతో ముచ్చటించినపుడు ఎన్నో విషయాలను వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
‘చంద్రుడు భూమికి దగ్గరగా రావటం అనేది తరచూ జరిగే సంఘటనే, అంతరిక్షంలో జరిగే సహజ ప్రక్రియే. చంద్రుడు భూమి చుట్టు తిరుగుతున్నపుడు చుట్టూ ఉండే కక్ష్య స్పష్టమైన వృత్తం ఆకారంలో లేకపోవటం వల్లే అపుడపుడు చంద్రుడికి, భూమికి మధ్యనున్న దూరం తగ్గుతూంటుంది. చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు. ప్రతి 16 నుంచి 20 ఏళ్లకు ఓ సారి ఇలా జరుగుతూంటుంది. అయితే ఈ సారి చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చిన రోజు పౌర్ణమి కావడం విశేషం. అందుకే నవంబర్ 14న కనిపించే చంద్రుడిని ‘సూపర్ ఫుల్‌మూన్’ అంటారు. ఫలితంగా చంద్రుడు మరింత కాంతివంతంగా, బాగా పెద్దగా కన్పిస్తాడు. ఇలాంటివి తరుచూ జరుగుతుంటాయి. వరుస క్రమంలో ఉన్న చంద్రుడు-్భమి-సూర్యుడి మధ్య సహజంగా జరిగే ప్రక్రియే ఇది. 21 శతాబ్దంలో మళ్లీ ఇలా రాకపోవడం అంటూ ఉండదు.
ప్రతి 16 నుంచి 20 ఏళ్లకు ఓ సారి అంటే శతాబ్దంలో నాలుగైదు సార్లు చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చే అవకాశముంది. ఈ నెల 14న సంభవించనున్న సూపర్ ఫుల్ మూన్ 1998లో వచ్చింది. మళ్లీ 2034లో కనిపిస్తుంది. సూపర్‌మూన్ వల్ల విపరిణామాలు ఏవీ ఉండవు. 14వ తేదీన మన దేశంలో ఎక్కడి నుంచి చూసినా ఆకాశంలో ఈ అందమైన, అరుదైన భారీ చంద్రుడిని చూడొచ్చు. ఆ పూర్ణచంద్రుడిని చూడటానికి టెలిస్కోప్ అవసరం లేదు. నేరుగా చూడొచ్చు. చంద్రుడు సాధారణం కన్నా ఎక్కువ ప్రకాశంతో, పెద్ద సైజుల్లో స్పష్టంగా కన్పిస్తాడు. కానీ పట్టణ ప్రాంతాల్లో వాతావరణ కాలుష్యం పెరిగిపోవటం, విద్యుత్ కాంతుల కారణంగా సూపర్ ఫుల్‌మూన్ అందచందాలు స్పష్టంగా కన్పించకపోవచ్చు. సిటీ నుంచి కనీసం వంద నుంచి నూటయాభై కిలోమీటర్ల దూరంగా వెళ్లి చీకటి బాగా ఉన్న ఉన్న ప్రాంతం నుంచి ఈ దృశ్యాన్ని వీక్షిస్తే అద్భుత దృశ్యం గోచరిస్తుంది. మామూలు పౌర్ణమినాటికన్నా సూపర్‌మూన్ సంభవించినప్పుడు సముద్రపు అలలు మరింత అలజడిని సృష్టిస్తాయని చెప్పొచ్చు. చంద్రుడు భూమికి దగ్గరగా (పెరిజీ) వస్తే సూపర్‌మూన్ అంటున్నాం. అదే భూమికి దూరంగా వెళ్లే సందర్భాన్ని అపొజీ (మైక్రోమూన్) అంటారు. ఇరవై ఇరవై అయిదేళ్ల క్రితం చంద్రుడు భూమికి దూరంగా వెళ్లిన అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 14న వస్తున్న సూపర్‌మూన్ కన్నా మరింత పెద్దగా కన్పించేలా చంద్రుడు భూమికి దగ్గరా వచ్చిన సంఘటన గతంలో జరిగింది. దిల్లీలో ఉన్నప్పుడు అది జరిగింది. అప్పట్లో దిల్లీలో విపరీతంగా కాలుష్యం ఉండటంతో మేఘాలు అడ్డొచ్చి చూడలేకపోయాను. ప్రస్తుతం వస్తున్న సూపర్‌మూన్‌ను అందరూ చూసి ఆనందించవచ్చు. కాలుష్యం, మేఘాలు అడ్డులేకపోతే ఆ దృశ్యం మరింత మనోహరంగా ఉంటుంది.’

-సిద్ధార్థ్,
ఖగోళ శాస్తవ్రేత్త, బిర్లా ప్లానిటోరియం, హైదరాబాద్