ఉత్తరాయణం

సౌదీ అరేబియా ఛాందసవాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌదీ అరేబియా ఇతర దేశాలలోని మసీదులకు నిధులు సమకూర్చడమే కాకుండా, ఛాందస వాహబీ ఇస్లాంను ప్రోత్సహిస్తున్నదని జర్మనీ ఛాన్సలర్ బహిరంగంగా ప్రకటించారు. ప్రపంచంలో వహాబీ ఇస్లాం విస్తరించడానికి ప్రధాన కారణం ఇదే. అమెరికాకు ఇది తెలియంది కాదు. అమెరికా విదేశాంగ మంత్రిగా పనిచేసిన మడెలైన్ అల్‌బ్రైట్, సౌదీ రాజు ఫహద్‌తో చర్చలు జరిపినప్పుడు, ఇతర దేశాల్లోని మసీదులకు నిధులను సమకూర్చే అంశాన్ని లేవనెత్తారు. తాను రాసిన ‘‘ ది మైటీ అండ్ ఆల్‌మైటీ’’ అనే పుస్తకంలో ఆమె ఈ వివరాలను స్పష్టంగా పేర్కొన్నారు. సౌదీ రాజు ఫహద్ (ఈయన 2005లో మరణించారు) మాట్లాడుతూ... ‘‘తమ ప్రభుత్వం సీమాంతర దేశాల్లోని 210 ఇస్లామిక్ కేంద్రాలు, 1500కు పైగా మసీదులు, 200 కళాశాలలు, దాదాపు రెండువేల పాఠశాలలకు సహాయం చేస్తున్నదని గర్వంగా చెప్పడం తనను ఎంతగానో నీరసింపజేసిందని ఆమె పేర్కొన్నారు. సౌదీలు తమ మతమే నిజమైనదన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంటారు. అందువల్ల విదేశాల్లో తమ మతానికి తగిన మద్దతివ్వడం, స్వదేశంలో ఇతర మతాలను అనుసరించనివ్వకపోవడంలో ఏమాత్రం అసంబద్ధత లేదని వారి దృఢమైన నమ్మకం. 9/11 దాడులకు ముందు, ముస్లి ఉగ్రవాద నెట్‌వర్క్‌ల గురించి ప్రస్తావించినప్పుడు సౌదీలు తీవ్రంగా ప్రతిస్పందించారు. కేవలం ఇస్లాంను దెబ్బతీసే ఉద్దేశంతోనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు’’ (208, 209 పేజీలు) అని రాశారు.
వచ్చే ఏడాది అమెరికాలో జరుగబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బహుశా డోనాల్డ్ ట్రంప్ ఎంపికయ్యే అవకాశముంది. ఆయన ఇటీవల ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, ‘‘ జిహాదీ టెర్రరిజం, ఇస్లామిజంను ప్రోత్సహిస్తున్నారు కనుక ముస్లింలను అమెరికాలోకి అనుమతించరాదు,’’ అని స్పష్టం చేయడం గమనార్హం.
సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధం పుణ్యమాని పారిపోతున్న ఆ దేశ ముస్లింలు, పక్కనే ఉన్న సౌదీ అరేబియా వంటి ముస్లిం దేశాలకు కాక, యూరప్ దేశాల్లోకి ప్రవేశించడం ఏమిటనేది ఆలోచించాల్సిన ప్రశ్న. ముస్లింలంతా ముస్లిం దేశాలకు కాకుండా యూరప్ దేశాలకు పారిపోవాలని రహస్య ఆదేశాలు ఏమైనా ఇచ్చారా? అనే అనుమానం కలుగక మానదు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ‘ఉమ్మా’ను ఏర్పాటు చేసుకున్నారు. అత్యంత దయాళువైన ఈ సంఘం వారు ప్రమాదంలో ఉన్నవారికి ఆశ్రయం కల్పిస్తారు. మరి ఈ ఉమ్మా వద్దకు వెళ్లకుండా సిరియా, ఇరాక్ ముస్లింలు యూరప్ దేశాలకు పారిపోవడం కేవలం క్రైస్తవ యూరప్‌ను, ఇస్లామిక్ యూరప్‌గా మార్చడానికేనా? అన్న అనుమానం కలుగుతోంది. మరి ముస్లిం దేశాలనుంచి వీరిని అనుమతించడం ద్వారా, యూరోపియన్ దేశాలు ఆత్మహత్యాసదృశంగా ప్రవర్తిస్తున్నాయని భావించాలా? ఏది ఏమైనా ప్రపంచానికి మత ఛాందసవాదం, పెను ముప్పుగా పరిణమించిందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
- హనుమాన్ చౌదరి, సికింద్రరాబాద్
బిజెపి వరద రాజకీయం
తమిళనాడు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల వచ్చిన వర్షాలు, వరదల వల్ల నష్టపోయినందుకు పరిహారం పొందాయి. తమిళనాడుకు రూ. 940 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ. 700 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంటులో ఎఐఎడిఎంకె మద్దతు పొందేటందుకు ఆడుతున్న స్వార్థపూరిత రాజకీయం కాక మరేమీ కాదు. 1) రాజధాని లేక 2) హుద్‌హుద్ తుఫాను నష్టపోయి 3) ఇటీవల కరువు కాటకాలు, తుఫానులకు నష్టపోవడం వీటిని పరిగణనలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చెయ్యకపోతే మంచిది కాదని బిజెపి, వెంకయ్యనాయుడుగారు తెలుసుకోవడం మంచిది. ఆంధ్రులు ఆరంభశూరులు కారని వారు తెలియచెప్పుతారని గమనిస్తే బిజెపికి శ్రేయస్సు అని సవినయంగా మనవి.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం
తగిన సంఖ్యలో బస్సులు నడపాలి
నల్గొండ పట్టణానికి చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రతీరోజూ వందలాది విద్యార్థులు, ఉద్యోగస్థులు చదువు, ఉద్యోగాలకోసం వస్తుంటారు. అవసరాలకు తగినట్లుగా ఆర్టీసీ సంస్థవారు తగినన్ని బస్సులను నడుపడం లేదు. అట్లే వున్న కొన్ని బస్సులు సమయపాలన పాటించకపోవడంవలన ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. బస్సులకోసం చాలాసేపు ఎదురుచూడడంవలన ఎంతో సమయం వృధా అవుతోంది. అవసరాన్ని దృష్టిలో వుంచుకొని ప్రైవేట్ ఆటోలు, జీపులు కెపాసిటీకి మించి ప్రజలను ఎక్కించుకోవడమేకాక, అన్ని భద్రతా ప్రమాణాలను గాలికొదిలేసి అధిక సొమ్ము కూడా వసూలు చేస్తున్నారు. అలాగే అధిక శాతం గ్రామాలలో కనీసం బస్‌షెల్టర్లు కూడా లేకపోవడంవలన బస్సులకోసం ఎదురుచూసేవారు ఎండ, వానల్లో తడుస్తూ నిల్చోవాల్సి వస్తోంది.