ఉత్తరాయణం

గోబెల్స్ ప్రచారం ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అఖండ భారత్’’- ఇది అందరూ కోరుకోవలసినది. కాని ఇప్పుడది ఆర్.ఎస్.ఎస్. వారి కోరికగా మారిపోయం ది. పైగా..అదేదో బూతుపదం అన్నంతగా, మన కమ్యూనిస్టు సోదరులు, కాంగ్రెస్ సోదరులు, గోబెల్స్ ప్రచారం ద్వారా సమాజంలో గగ్గోలు పెట్టారు. వియత్నాం, జర్మనీలు కలిసికట్టుగా భవిష్యత్తులో వాటి అవసరాల దృష్ట్యా భారత్, పాక్, బంగ్లాదేశ్ కలవవచ్చు. దానికెందు కింత గగ్గోలు? మన కమ్యూనిస్టు సోదరులు, ‘‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి’’ అంటున్నారు. వాస్తవానికి రష్యా ముక్కలైంది. చైనా ఇనుప తెర తొలగిస్తే ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ప్రపంచంలోని కమ్యూనిస్టు దేశాలన్నీ కమ్యూనిజాన్ని వదిలేశాయ. అయనా మన కమ్యూనిస్టులు ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్న నినాదాన్ని వీడటం లేదు. దానికి మిగిలినవారు గగ్గోలు పెట్టవద్దా? అంతకంటె విచిత్రం-కార్మికులకు- సమ్మె హక్కు ఉండాలంటారు. ఇది వారి సిద్ధాంతం. కాని కమ్యూనిజం వచ్చిన దేశంలో కార్మికులు ఈ హక్కును కోల్పోతారు.
మన కాంగ్రెస్ సోదరులు కమ్యూనిస్టులకంటె ఏమీ తక్కువ కాదు. మనదేశంలో త్యాగ పురుషులు అంటే నెహ్రూ, ఇందిరా గాంధి, సోనియా గాంధి, రాహుల్ గాంధి...అలా నెహ్రూ కుటుంబమే. ఈ మధ్య మోదీజీ సర్దార్ పటేల్ పేరు పైకి తెస్తుంటే, కాంగ్రెస్ వారు, అదేదో పెద్ద తప్పు జరిగిపోతున్నట్టు గగ్గోలు పెడుతున్నారు. వాస్తవానికి సర్దార్ పటేల్ కాంగ్రెస్ పార్టీవారే కాని, భాజపాకు చెందినవారు కాదు కదా.
ఇంకో విచిత్రమేమంటే గాంధీ వారసులుగాని, పటేల్ వారసులు గాని, తిలక్ వారసులు గాని, అంతెందుకు మొన్నటి మన లాల్ మహద్దూర్ శాస్ర్తీ వారసులు గాని, మన టంగుటూరు ప్రకాశం పంతులు వారసులు గాని, ఎవరూ త్యాగధనులలో లేరు. అసలు వారి పేర్లు కూడా లేవు. కాంగ్రెస్ వారి పథకాలన్నింటికీ నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌ల పేర్లే.
దాదాపుగా పైన చెప్పిన వారెవరూ తమ వారసులకు ఆస్తులేమీ కట్టపెట్టలేదు. మన ప్రకాశంగారైతే తన వారసులకు కట్టుగుడ్డలకు కూడా ఇబ్బంది పడే స్థితిని ఇచ్చారు. కాని విచిత్రంగా పై పెద్దలెవరూ కాంగ్రెస్ వారికి త్యాగధనులు కాలేదు. ఇక స్వాతంత్య్రం కోసం చిన్న వయస్సులోనే ఉరికంబాలెక్కిన, భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, చాపేకర్ సోదరులు, మదనలాల్ డింగ్రా, ఖుదీరామ్ బోస్, ఉద్దాంసింగ్ మున్నగువారిని, రాసబీహారీ బోస్, సుభాష్ చంద్రబోస్, మేడం కామా, సావర్కార్ లాంటి వారిని తలచే తలంపే లేదు. వీలయతే వీరిని దేశ శత్రువులుగా చిత్రించే ప్రయత్నం చేశారు. కాని వీరెవరూ చేయని పని నెహ్రూ కుటుంబం చేసింది. మోతిలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇంతమంది దేశం కోసం త్యాగం చేస్తూ పోతున్నా, వాళ్ల ఆస్తిపాస్తులు మాత్రం పెరుగుతూ పోతున్నాయ. సోని యాగాంధీ ప్రపంచంలో ధనవంతులైన మహిళల్లో ఐదవ స్థానాన్ని ఆక్రమించిందన్న విషయం మనమంతా వార్తల్లో చదివాం. ఇంత లొసుగులున్న వీరికి ఆర్.ఎస్.ఎస్. వారి అఖండ భారత్‌పై గొబెల్స్ ప్రచారం ఎందుకు?
- వల్లూరు రామకృష్ణ, హైదరాబాదు
చిన్నారులకు రక్షణ ఏదీ?
మన దేశంలో మోటారు వర్కు షాపులు, హోటళ్ళు, బాణాసంచా తయారుచేసేచోట్ల బాలురతో పనిచేయించుకొని వారి హక్కులు కాలరాస్తున్నారని, అంతర్జాతీయ కార్మిక సంస్థ సహితం తప్పుపట్టింది. వారి స్వేచ్ఛను హరిస్తూ ఏ పనిని చేయించుకొన్నా అది దోపిడీగా చూడబడుతుంది. పిల్లలతో మానవ ద్రవ్యాలు ఎగుమతి చేయడం అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించుకోవడం చాలా అన్యాయమే. మరి సభ్యసమాజంలో నర్సనీ ప్రిస్కూలు క్లాసులనుండి మోయలేని బరువు పుస్తకాలు నెత్తిన పెట్టి ఇరుకు గదుల్లో శిక్షణ పేరుతో శిక్షించే ఈ పాఠశాలల నుంచి చిన్నారులకు రక్షణ ఏది? పెద్దలు ఆలోచించవలసిన విషయమిది.
- జి.సాహితి, అత్తిలి
పూర్వ విద్య సముచితమే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సర్కారు ప్రాథమిక పాఠశాలల్లో ఎల్.కె.జి, యు.కె.జి. వంటి పూర్వ విద్యాతరగతులను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంకావడం గుణాత్మక పరిణామమనే పేర్కొనవచ్చు. తొలి దశలో 1400 పాఠశాలల్లో పూర్వ విద్యాతరగతులను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర పాఠశాలల విద్యాకమిషనర్ కె.సంధ్యారాణి ప్రకటించడం సంతోషదాయకం. ఇప్పటికీ చిక్కి శల్యమైన ప్రభుత్వ పాఠశాలలు ఎంతోకొంత బలోపేతమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యలేనందున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు కానె్వంట్లకు పంపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నందున సత్ఫలితాలు వస్తాయి. అయితే ఎల్.కె.జి, యు.కె.జి. తరగతులను అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన రోజునే ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయి.
- వి.కొండలరావు, పొందూరు