ఉత్తరాయణం

ఆ ప్రోనోట్లు ధ్వంసం చెయ్యాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాల్‌మనీ వ్యవహారంలో ‘ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు. డొక్క చించుతాం..’ వగైరా మాటలు ఏవీ ఆ అభాగ్యపు మహిళలకు ఊరటనివ్వవు. ఆమహిళలు ఎవరిపైన ఆరోపణలు చేస్తారో వాళ్ల దగ్గరినుంచి ఆ మహిళల పేర ఉత్తరాలు రాయించి తీసుకోవాలి. ‘‘ ఈమె నాకు చెల్లించవలసిన డబ్బు మొత్తం ఇప్పుడే చెల్లించేసింది. ఇకనుంచి ఒక్క పైసా కూడా ఈమె నాకు బాకీ లేదు. ఇంకా ఈమె నాకు రాసిచ్చిన ప్రోనోటు ఏది నేను ఇంకెవ్వరికీ బదిలీ చేయలేదు. అట్టినోటు ఏదైనా ఉంటే అది కూడా ఇప్పుడు రద్దయినట్టే. ఈమె నాదగ్గర కుదువ బెట్టిన ఆస్తి/ఆస్తులు ఆమెకు తిరిగి ఇచ్చేస్తున్నాను.’’ అని ఒక లాయరు సమక్షంలో ఆ ఉత్తరం రాయించాలి. ఇక రెండవ అంశం.. ఆ బూతు సీడీల్లోకి బలవంతంగా ఎక్కించబడ్డ వయస్సులో ఉన్న యువతులు, ముఖ్యంగా చదువుకునే ఆడపిల్లలు సమాజం మీద ద్వేషం పెంచుకొని నక్సలైట్లు, టెర్రరిస్టులుగా మారే ప్రమాదం ఉంది కనుక, ఆ నేరస్థుల ద్వారానే ఆ సీడీలన్నింటినీ సేకరింపజేసి నాశనం చెయ్యాలి. ఈ రెండు పనుల వల్ల మాత్రమే దురదృష్టవంతులైన ఆ బడుగు మహిళలకు ఎంతో కొంత ఊరట కలుగుతుంది. క్షుద్రమైన, పిశాలకు సంతానం వంటి ఆ కాల్‌మనీ ఆపరేటర్లకు వణుకు పుడుతుంది. కాల్‌మనీ వ్యవహారం సభ్య సమాజానికి సిగ్గుచేటుగా పరిణమించిన నేపథ్యంలో, ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకోవాలి.
- గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు, ఏలూరు
నెలరోజుల నరకం
కాలజ్ఞానంలో రాఘవేంద్రుడు భవిష్యత్తులో నెల్లూరు మండలం వుండదని చెప్పేడు. కానీ ఇదేమిటి? ముందుగా చెన్నై నగరం..జల ప్రళయం.. ఇంచుమించు నెల రోజుల నరకం. బీద, ధనిక భేదం లేదు. కరెంటు లేకుండా...అన్నానికి ముఖం వాచి..ఆర్తుల్లాగా చేయి చాచి అర్థిస్తూ, భర్తలు ఆఫీసులో, పిల్లలు స్కూళ్లలో, తల్లులు ఇళ్లలో..ఒకరికోసం ఒకరు వేదనగా...పూర్వం అనేవారు ...పగవారికి కూడా ఇటువంటి కష్టాలు రాకూడదని. దేశం మొత్తం ఈ విపత్తుకు స్పందించింది. పారిశ్రామికవేత్తలు, సినీనటులు అందరూ చెన్నై కోలుకునేవరకు సాయం అందిస్తామంటూ రంగంలోకి దిగేరు. మనది ఆధ్యాత్మిక దేశం. ఎవరికి కష్టం వచ్చినా, చలించిపోతాం. పదిమందీ తలోచెరుూ్య వేస్తేనే నెల రోజుల్లో చెన్నై పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. 25వేల మంది కార్మికులు మద్రాసును శుభ్రం చేయడానికి శ్రమించారు. కురిసే వానలు కొద్ది రోజులే అయినా నష్టం అపారంగా ఉండటమే విషాదం.
-అపర్ణా దీక్షిత్, విజయవాడ
హిందువులను దెబ్బతీయడానికే...
ఉస్మానియా క్యాంపస్‌లో బీఫ్ ఫెస్టివల్ పేరుతో జరిగిన అలజడి హైకోర్టు ఆదేశాలతో పోలీసువారి ఆంక్షలతో సమసిపోయింది. కానీ ఈ ఉదంతం వల్ల ఒక్క విషయం స్పష్టమైంది. ఐక్యతలేని హిందువులను లక్ష్యంగా చేసుకుని దళితుల పేరుతో, బహుజనుల పేరుతో అన్ని స్థాయిల్లో, అన్ని రంగాల్లో దెబ్బతీయాలన్న ప్రయత్నం జరుగుతోంది. అయినా ఈ బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకులు ఎవరు? డేవిడ్, అలెగ్జాండర్, స్టాలిన్ అట! ఎక్కడినుంచో చదువుకై తల్లిదండ్రుల ఆశలను మోసుకొని వచ్చిన ఇతర విద్యార్థులు వీరి వలలోపడటమేంటి?
-మామెడ రాజేంద్ర ప్రసాద్, వౌలాలి
పర్యావరణానికి మేలు చేసే గోవు
పర్యావరణ సదస్సు సందర్భంగా అన్ని దేశాలూ, స్వచ్ఛందంగా కర్బన ఉద్గారాలను నియంత్రించాలని నిర్ణయించాయి. హోమగుండంలో కొద్దిపాటి ఆవునెయ్యి వేసినప్పుడు చాలా ఎక్కువ పరిమాణంలో ఆక్సిజన్ వెలువడిందని పరిశోధకులు చెబుతున్నారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో ఒక కుటుంబం ఆవు పిడకల హోమం వల్ల రక్షించబడినట్లుగా విన్నాము. కర్రి ఆవు మూత్రాన్ని 40 రోజులు సేవించి ఒరిస్సాలోని ఒక పాప అతి తీవ్రమైన మూత్రపిండాలలో రాళ్ల సమస్యను నయం చేసుకోగలిగిందని కూడా వార్తలు చదివాము. ఒక గోవు జీవామృతం, బీజామృతంతో 30 ఎకరాల్లో వ్యవసాయం చేయవచ్చునని వార్తలు వచ్చాయి. జనానికి జవజీవాలను అందిస్తూ, పుడిమితల్లికి పునరుజ్జీవన చేస్తూ వాతావరణంలోని రేడియేషన్‌ను తగ్గించే గోవుల సేవ ద్వారా పాపకర్మలను నశింపజేసికొనవచ్చు. హిందువుల మనోభావాలను కించపరుస్తున్న కొందరు, బీఫ్ ఫెస్టివల్స్ చేయబూనడం, మాకు నచ్చినవి మేం తినే హక్కు లేదా అని ప్రశ్నించడం, అంతర్జాలంలో కూడా యాంత్రిక గోవధ శాలలో గోవధను అతి బీభత్సంగా ఉన్న వీడియోను ప్రదర్శించడం చూస్తుంటే అమెజాన్ అడవుల్లో ఉంటే ‘కేనీబాల్స్ అనబడే నరమాంస బక్షకులకు వీళ్లకి తేడాలేదనిపిస్తుంది. కొంతమంది ముస్లిం మత పెద్దలు గోవధను నిరసిస్తూ గోక్షీర దినోత్సవాన్ని జరిపిస్తూ హిందువుల మనోభావాలను గౌరవిస్తున్నారు. అటువంటి వారు మనకు ఆదర్శప్రాయులు.
- తాళ్లూరి మణి, కాకినాడ
పునరావాసం కల్పించాలి
విశాఖలో ఫార్మాసిటీ ఏర్పాటు నేపధ్యంలో భూములు కోల్పోయిన వారికి ఇప్పటివరకు పునరావాసం కల్పించకపోవడం బాధాకరం. మరొకవైపు ఫార్మాసిటీ పరిసర ప్రాంతాలలో గత మూడు సంవత్సరాలుగా ఫార్మా కాలుష్యం వలన తాడి గ్రామం తీవ్రంగా ప్రభావితమైనందున, గ్రామస్థులందరినీ తక్షణం తరలించి వారికి మెరుగైన పునరావాసం కల్పిస్తామన్న ప్రభుత్వం వాగ్దానం అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పుడు పరవాడ గ్రామం కూడా కాలుష్యానికి ప్రభావితమై గ్రామస్థులు తీవ్ర వ్యాధులకు గురవుతున్నారు. ఫార్మాసిటీలో నెలకొల్పబడిన కంపెనీలు స్థానికులకు ఉద్యోగాలలో ప్రాధాన్యత కల్పిస్తామన్న వాగ్దానం కూడా నీటిమీద రాతలుగా మిగిలిపోయింది.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం