ఉత్తరాయణం

కమ్యూనిస్టుల చారిత్రక తప్పిదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేయడం చారిత్రక తప్పిదమని ఇటీవలి ఢిల్లీ సమావేశంలో కమ్యూనిస్టు నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ ధంగా ‘‘చారిత్రక తప్పిదం’’ అనే పదాన్ని ఉచ్ఛరించడం కమ్యూనిస్టులకు ఆనందమేమో మరి. గతంలో కూడా ఇటువంటి చారిత్రక తప్పిదాలు వారు చాలా చేశారు. నెహ్రూ ప్రభుత్వాన్ని ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్యవాద మంటూ ద్వేషించడం, రెండు జాతుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ముస్లింలీగ్‌ను సమర్ధించడం, 1962 చైనా యుద్ధంలో భారత్‌దే తప్పని వాదించడం, ఎమర్జెన్సీకి అనుకూలంగా మాట్లాడటం, సుబాష్ చంద్రబోస్‌ను విమర్శించడం, 1998లో జ్యోతిబసును ప్రధానిని చేయడానికి అంగీకరించకపోవడం వంటివన్నీ వీరు చేసిన గతకాలపు ‘చారిత్రక తప్పిదాలు’. ఇప్పుడు కాం గ్రెస్‌తో బెంగాల్‌లో జట్టుకట్టడం, కేరళలో వ్యతిరేకంగా పోటీ చేయడం కూడా చారిత్రక తప్పిదమేనని వారి అభిప్రాయం. ఇవన్నీ చూస్తుంటే, కమ్యూనిస్టులు భార త్‌కు ఎంతమాత్రం పనికిరారనేది సుస్పష్టం. అందువల్లనే ఆ పార్టీలో అనేక చీలికలు వచ్చాయ. తొమ్మిది కమ్యూ నిస్టు పార్టీలు, వాటికి సంబంధించిన 80 అనుబంధ సంస్థలు ఎన్నికల రంగంలో ఎంతగా ప్రచారం చేసినా, వీరి అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవడమే అందుకు నిదర్శనం.
- డాక్టర్ టి.హెచ్. హనుమాన్ చౌదరి, సికిందరాబాద్
వేళకు రాని పుస్తకాలు
గ్రంథాలయాలలో అన్ని రకాల దిన, వార, పక్ష, మాస పత్రికలను ప్రతిరోజూ చదవవచ్చు, కాలక్షేపంతోపాటు సమకాలీన చరిత్ర, విజ్ఞానం పెరుగుతాయి. కథలు, నవలలు చదవవచ్చని చాలా మంది క్రమం తప్పకుండా గ్రంథాలయాలకు వెళ్తుంటారు. కాని చాలా గ్రంథాలయాలలో దినపత్రికలు మాత్రమే ఏరోజువి ఆ రోజు దర్శనమిస్తుంటాయి. వార, మాస పత్రికలు మార్కెట్లోకి విడుదలై 2 లేదా 3 వారాలకు గాని గ్రంథాలయాల్లోకి అడుగిడటం లేదు. ఇది పాఠకులను చాలా అసౌకర్యానికి గురి చేస్తుంది. మరి ఇంత బద్ధకానికి కారణం ఏమిటి? అన్ని వార మాస పత్రికలు మార్కెట్లోకి వెలువడిన రోజే గ్రంథాలయాలకు వచ్చేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
ప్రాభవం కోల్పోయన కాంగ్రెస్
ఎన్‌డియే రెండేళ్ల పాలనపై విరుచుకుపడుతోంది కాంగ్రెస్. భాజపా చేసింది శూన్యం, శుష్క వాగ్దానాలే అని ఈసడిస్తోంది. పాలక పక్షం ఏం చేసినా చేయకున్నా విమర్శించడమే ప్రతిపక్షాల పని. అలాగే విపక్షాల్ని పాలక పక్షమూ ఆడిపోసుకుంటుంది. అయితే ప్రజలు తెలివైనవారు. ఏ పార్టీ సత్తా ఏపాటిదో వారికి బాగా తెలుసు. అందుకే 15 ఏళ్లపాటు అసోంని ఏలిన కాంగ్రెస్‌ని కూలదోసి భాజపా సంకీర్ణాన్ని తలకెత్తుకున్నారు. ఓటూ, సీటూ లేని రాష్ట్రాల్లో పదిశాతం పైగా ఓట్లు సాధించి కొన్ని సీట్లను గెలుచుకుంది భాజపా. దశాబ్దాలపాటు దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల తోక అయిపోయింది. ఒక పెద్ద రాష్ట్రం, ఆరు అతి చిన్న రాష్ట్రాలకే పరిమితమైపోయింది. కాంగ్రెస్ వారు ఇది ఆలోచించరా?
- ప్రసాద్, గొడారిగుంట
రెంటికీ చెడిన రేవడి
ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు కోరుతూ వస్తున్న ఉత్తరాలు చూస్తున్నాం. కాని విద్యావేత్తలు పాఠశాల స్థాయిలో మాతృభాష జూనియర్, డిగ్రీ కాలేజీల స్థాయిలో ఆంగ్ల మాధ్యమం ఉండాలంటున్నారు. మాతృభాష బాగా వస్తే ఆంగ్లం సులభంగా వస్తుంది. జర్మనీ, రష్యా, చైనా, జపాన్, కొరియా లాంటి ఎన్నో దేశాల్లో ప్రాథమిక విద్యనుంచి రిసెర్చ్‌వరకూ మాతృభాషలోనే సాగుతోంది. 125 పైగా ఉన్న దేశాల్లో కేవలం 11 దేశాల్లోనే ఇంగ్లీషు మాట్లాడ్డం, అర్ధం చేసుకోవడం జరుగుతోంది. ఆంగ్లమాధ్యమంలో పాసైన వాళ్లు ఎంతమంది ఇంగ్లీషు చక్కగా మాట్లాడగలుగుతున్నారు? ఎందరికి ఇంగ్లీషు సినిమాల్లో మాటలు అర్ధం అవుతున్నాయి? మనవాళ్లు ఆంగ్లానికి, ఆంధ్రానికి రెండింటికీ చెడుతున్నారు. ఇది వారి భవిష్యత్తును దెబ్బ తీస్తోంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు హాజరయ్యే సమయంలో, వీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పై తరాల్లో పదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదివి తర్వాత సాయలో ఆంగ్ల మాధ్యమంలో చదివేవారు.
- చైతన్య, వాకలపూడి