ఉత్తరాయణం

విద్యాలయాలు దేవాలయాలుగా భాసిల్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యాలయం ఒక దేవాలయం. జాతికి భవిష్యత్తు నాయకులను ఇచ్చి మానవ విలువలను, జాతి సంస్కృతిని పదిలపరచే పవిత్ర స్థలాలు. వీటిలో మత, జాతీయ, మానవతా విలువలుకు భంగపరచే ఎలాంటి కార్యక లాపాలను అనుమతించరాదు. జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అని కదా వేదవాక్కు. విద్యార్థులు, అధ్యాపకులు, సహనానికి జాతీయ సమైక్యతకు పెద్దపీట వేయాలి. దేశ విచ్ఛిన్నతకు, దేశభక్తిని భంగపరచే కార్యక్రమాలను నిషిద్ధాలు.
- సుజాతా నాగరాజారావు, కావలి
ప్రజలే ‘సుప్రీం’
‘ఎవరు సుప్రీం’ అన్న వీక్‌పాయంట్ వ్యాసం బాగా ఆలోచింపజేసింది. కానీ ప్రజలు సుప్రీం అని, నేతలకి గానీ, కోర్టుల కెందుకు తోచవో అర్థంకాని విషయం. ఈ భావన ప్రజలందరి లోనూ మెదులుతుంది. ఈ నాటి కోర్టుల వ్యవహారం మనకు బ్రిటిషువారు ప్రసాదించిన భాగ్యం అని మరువరాదు. బ్రిటిషు వారు వెళ్లిపోతూ పనికి రాని స్వాతంత్య్రం ఇచ్చారు. కానీ దానివల్ల ప్రయోజనం కనిపించడం లేదు. ఇక కోర్టులు ప్రజల గోడు పట్టించుకోకపోతే ఎలాగ? ఉదాహరణకు హైదరా బాద్‌లో ఛైన్‌స్నాచింగ్‌లు జరిగాయ. హెల్మెట్ ధరించిన చోరులు చక్కగా తప్పించుకొని పోతున్నారు. మరి పారదర్శక హెల్మెట్లు ఉంటే ఇటువంటి వారిని గుర్తించి పట్టుకోవడం సాధ్యమవుతుంది. ఈ మేరకు కోర్టులు ఆదేశిస్తే బాగుంటుందని విన్నపం.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్టణం
అందరికీ వర్తింపజేయాలి
కలెక్టర్లు, ఐపిఎస్ పోలీసు అధికార్లను నిర్ణీత కాలం లోపల బదిలీ చేయరాదన్న సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయం. ఈ విధానం వల్ల దేశం బాగుపడుతుంది. ఈ తీర్పును మండల స్థాయ, జిల్లా స్థాయల్లో వివిధ శాఖా ధికార్లకు కూడా వర్తింపజేయాలి. రాజకీయ నాయకుల లిఖిత పూర్వక ఆదేశాలు లేకుండా దేన్నయనా అమలు జరిపినా సదరు అధికార్లను శిక్షించాలి. ఈ విధివిధానాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్చలు చేపట్టాలి.
- గోపాలుని శ్రీరామమూర్తి, వినుకొండ
నేర్పేది దేశద్రోహ పాఠాలా?
జెఎన్‌యులో విద్యార్థులను దేశ ద్రోహులు ముద్రవేసి అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ మోదీ ప్రభుత్వం ఎమర్జెన్సీని తలపింప జేస్తున్నదని సీతారాం ఏచూరి పేర్కొనడం విడ్డూరం. వామపక్షాలు ఇందిరాగాంధీ విధించిన ఎమర్జె న్సీని సమర్ధించాయ కదా. ఇప్పుడు అత్యున్నత న్యాయ స్థానం తీర్పుని కూడా ధిక్కరించి దేశ ద్రోహులకి జై కొడుతూ స్వదేశ నాశనాన్ని కోరుకునే వారిని మన దేశమే కాదు మరే దేశం కూడా సమర్ధించ జాలదు. అరెస్టుల వల్ల జెఎన్‌యు ప్రతిష్ఠ మంట గలుస్తుందని వాపోయే ప్రొఫె సర్లు విద్యార్థులకు నేర్పుతున్నది దేశ ద్రోహ పాఠాలా? అని ప్రపంచం విస్తుపోతున్నది.
- కృష్ణ, కొండయ్యపాలెం, తూ.గో. జిల్లా
వర్గీకరణ బిల్లుకు మోక్షం ఎప్పుడు?
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు గత రెండు దశాబ్దాలుగా ఎన్ని ఉద్యమాలు చేసినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం వారు ఎస్‌సి వర్గీకరణను చట్టబద్ధం చేయలేదు. ఎస్‌సి వర్గీకరణాన్ని గురించి జస్టిస్ ఉషామెహరా కమిషన్‌ను ప్రభుత్వం నియమించి ఆరేళ్లు దాటినప్పటికీ ఇంతవరకు కమిషన్ నివేదికను పార్లమెంటు ముందుంచలేదు. ఈ కమిటీ నివేదికను అమలు చేస్తే మాదిగ, రెల్లి, దాని ఉపకులాల వారికి మేలు జరుగుతుంది. అందువల్ల నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఉషా మెహరా కమిషన్ నివేదికను పార్లమెంటులో ప్రవేశ పెట్టాలి.
- మందపల్లి సత్యం, రామచంద్రపురం
మంచి రోడ్లను తవ్వేస్తున్నారు
ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ పుణ్యమా అని విశాఖనగరంలో రోడ్లు బాగుపడ్డాయి. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి నగరంలో క్రొత్తగా రోడ్లువేసి విశాఖ వాసుల వెతలను జి.వి.యం.సి. తీర్చింది. అయితే వీటిని ప్రారంభించే ముందు భూగర్భ డ్రైనేజి పనులను పూర్తి చెయ్యకపోవడం వలన రోడ్లు పూర్తయిన వెంటనే వాటిని మళ్లీ తవ్వెయ్యడం ప్రారంభించారు. అలాగే నీటి పైపుల మరమ్మత్తు, భూగర్భ కేబుల్స్ కోసం ఆయా శాఖలు తవ్వేసి వాటిని పూడ్చేయకుండా వదిలేస్తున్నారు. క్రొత్తగా రోడ్డు వేసాక వాటిని తవ్వడానికి జి.వి.యం.సి. అనుమతి ఎలా యిచ్చిందో అర్థంకావడం లేదు. వివిధ ప్రభుత్వశాఖల మధ్య సమన్వయం లోపించిన కారణంగా కోట్లాది ప్రజాధనం వృథా అవుతోంది.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం